జీఓ నెంబర్ 7ను వెనక్కి తీసుకోవాలి
04-05-2026 12:52 AM
కొత్తపల్లి, మే 3(విజయక్రాంతి): శాతవాహన యూనివర్సిటీ బిఆర్‌ఎస్వి ఇంచార్జీ చుక్క శ్రీనివాస్ మాట్లాడుతూ మీడియతో ఆదివారం రోజు మాట్లడుతూ ఫీజు రీయంబర్స్మెంట్ 9 వేల కోట్ల రూపాయలు విడుదల చేయక పోగా నేడు G.O 7 ను తీసుకువచ్చి విద్యార్థులను ఏం చేద్దాం అనుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
నాడు ఒక మాట - నేడు ఒక మాటా,అధికారంలోకి రాగానే విద్యార్థుల గొంతు కోస్తారా వెంటనే జీవో 7ను రద్దు చేయాలి - పేద విద్యార్థులను ఆదుకోవాలని, తక్షణమే జి ఓ నంబర్ 7 ను వెనక్కి తీసుకోవాలని హెచ్చరిస్తున్నాము లేని యెడల విద్యార్ధి లోకమంతా ఏకమై మంత్రుల ఇండ్ల ముట్టడి మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను రోడ్లమీద తిరుగునీయకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.






