4 April, 2026 | 2:10 AM

పిప్పిరిలో సీఎం సభకు ఏర్పాట్ల పరిశీలన

04-04-2026 12:20 AM

జిల్లాలో రూ. 600 కోట్లతో అబివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు

మంత్రి జూపల్లి వెల్లడి

ఆదిలాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6న ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం సభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించెందుకు ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి జిల్లాలో పర్యటించారు.

ప్రత్యేక హెలిక్యాప్టర్లో నేరుగా సీఎం సభ నిర్వహించే పిప్పిరి గ్రా మానికి చేరుకున్న మంత్రులకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే లు అనిల్ జాదవ్, ప్రేమ్ సాగర్ రావు, కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అధికారులు, ప్రజా ప్రతినిధులు సభా ప్రాంగణాన్ని పరిశీలించి, పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమీ క్షా సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ..  బోథ్ నియోజకవర్గంలో సుమారు రూ.1200 కోట్ల వ్యయం తో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్కు సీఎం శంకుస్థాపన చేయను న్నారని తెలిపారు. ఈ విద్యా సంస్థలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. అలాగే బాసర సరస్వతి దేవాలయ అభివృద్ధికి రూ. 300 కోట్లు, 2027 గోదావరి పుష్కరాల కోసం రూ. 500 కోట్లతో కుంభమేళా తరహాలో ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు.

జిల్లా వ్యాప్తంగా రూ. 600 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరగనున్నా యని తెలిపారు. సభకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లె పూల నర్సయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ బం డారి అనూష, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాద వ్, నాయకులు ఆడే గజేందర్, కంది శ్రీనివాస్ రెడ్డి, గండ్రత్ సుజాత, బోరంచు శ్రీ కాంత్ రెడ్డి,  అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.