4 April, 2026 | 2:09 AM

ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

04-04-2026 12:20 AM

కోదాడ, ఏప్రిల్ 3 : కోదాడ పట్టణంలోని స్థానిక నయా నగర్ బాప్టిస్ట్ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మున్సిపాలిటీ చైర్మన్ ఎర్నేని కుసుమ బాబు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రైస్తవులకు అన్ని విధాల సహకరిస్తామని హామీ ఇచ్చారు వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు 14 వ వార్డు కౌన్సిలర్ కందుల కోటేశ్వరరావు 13వ వార్డు కౌన్సిలర్ గురమ్మ సైదుబాబు పాల్గొని , భక్తులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు.

ఏసు ప్రభువు సిలువలో పలికిన ఏడు మాటలు ఏడుగురు వక్తలు వివరించారు. మోజస్ స్రవంతి, శార, యాతాకుల జ్యోతి  కవిత భాగ్యశ్రీ మెరీనారాణి  ఏసుప్రభు వారి పలికిన మాటలు మాట్లాడి క్రీస్తు ప్రేమను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొల్లి కొండ కోటయ్య బానోతు జగ్గు నాయక్, జాన్  హెడ్ కానిస్టేబుల్  సోమ పంగు నాగేశ్వరరావు శ్రవణ్ యాతాకుల మధుబాబు తదితరులు పాల్గొన్నారు.

మోతె..

మోతె, ఏప్రిల్ 3: మండల కేంద్రంతో పాటు మండల వ్యాప్తంగా వివిధ గ్రామాలలో గుడ్ ప్రైడ్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం ఫాస్టర్ రవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆత్మవిశ్వాసం కల్పించి భూమి మీద ఉన్నా సకల జీవ రాసులకు ప్రతి ఒక్కరికి బతుకు మీద ఆశ కల్పించడం కాకుండా క్రమ శిక్షణతో పాటు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నామని చెప్పారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించడం తో పలువురు భక్తులు నీళ్ళతో పాటు పాలు అరబోసి పాదాభి వందనం చేసుకున్నారు.  ఫాస్టర్ లు యిర్మీయా,  లాజర్, దావీదు, కోర్నలి తిమోతి, ఎలీషా మోస, వార్డు సభ్యులు కోట సంజీవ, మనోజ్, దివ్య, రాము, యల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

ప్రేమ, కరుణతో సర్వం సుసాధ్యం 

సూర్యాపేట, ఏప్రిల్ 3 (విజయక్రాంతి) : ప్రేమ, కరుణ సహనంతో సర్వం సుసాధ్యం చేయవచ్చని నిరూపించిన ఏకైక వ్యక్తి యేసు ప్రభువు అని సూర్యాపేట ఆర్సీఎం చర్చ్ ఫాదర్ రెవరెండ్ కస్పారెడ్డి పేర్కొన్నారు. పరిశుద్ధ శుక్రవారం (గుడ్ ఫ్రైడే) సందర్భంగా శుక్రవారం సూర్యాపేట లోని నిర్మల చర్చి ఆధ్వర్యంలో సిలువ దారి ఏసుక్రీస్తు చివరి రోజులను నాటక రూపంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా  పట్టణంలోని నిర్మల చర్చ వద్ద నుండి  పరిశుద్ధ సిలువ మార్గం కార్యక్రమం అంబేద్కర్ బొమ్మ, శంకర్ విలాస్, గాంధీ బొమ్మ, ఆకారపు సుదర్శన్ బొమ్మ, నిర్మల ఆసుపత్రిలోని  కల్వరికొండ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు మరణానికి సంబంధించిన 14 గుర్తులను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ  ప్రపంచ మానవాళిని పాపముల నుండి విముక్తులు చేసేందుకు క్రీస్తు ప్రభువు సిలువపై మరణం పొందాడని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు పాపాల నుండి విముక్తులు కావాలని సూచించారు. చెడు వ్యసనాలను త్యజించి ప్రభు చూపించిన సన్మార్గం  మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. అనంతరం సాయంత్రం ఆర్.సి.యం చర్చిలో సిలువ ముద్దు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇతర ఫాదర్ లు, నిర్మల సిస్టర్స్, ఏ వి యం సిస్టర్స్, కాన్సిల్ మెంబెర్స్ ముక్కలా మర్రెడ్డి, వల్లమల్ల  బాలాస్వామి, పిండిగ అజయ్, నాగటి ఏసుదాసు, బంధ శ్యాంసన్, పట్టేటి బాలశౌరి, పాండురంగీ బాలరాజు, గోపికిరణ్, కతోలిక విశ్వాసులు, తదితరులు పాల్గొన్నారు.