4 April, 2026 | 3:03 AM

గ్యాస్ సిలిండర్ల కోసం బారులు

04-04-2026 01:20 AM

అదనపు డెలివరీ ఛార్జీలు వసూలుచేస్తున్న గ్యాస్ ఏజెన్సీలు

బిచ్కుంద, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా  బిచ్కుంద మండలంలో ప్రజలకు గ్యాస్ సిలిండర్ల తిప్పలు తప్పడం లేదు. గతంలో మాదిరిగా బుకింగ్ చేసుకుంటే డోర్ డెలివరీ  అయినట్లు లేక బుకింగ్ లోనే అంతరాయాలు తలెత్తడం పై డెలివరీ లో అంతరాయం ఏర్పడడంతో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద గ్యాస్ సిలిండర్ల కోసం బారులు తీరుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద  సిలిండర్ల బుకింగ్ కోసం పడిగాపులు కాయల్సివస్తోందని ఆవేదన చెందుతున్నారు.

ఇదే అదనుగా భావిస్తున్న హెచ్ పి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ట్రాన్స్పోర్ట్ డెలివరీ ఛార్జీలు 60నుంచి 100రూపాయలు అదనంగా  బలవంతంగా వసూల్ చేస్తున్నారని పలువురు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా సరఫరా చేసేవారైతే ఏకంగా తాము తీసుకుపోయి డోర్డెలివరి ఛార్జీలు వసూలుచేస్తున్న రని వారు డోర్ డెలివరీ చేస్తే అదనపు ఛార్జీలు వసూలుచేస్తున్న రని ఆవేదన చెందుతున్నారు.

ఇదిలాఉంటే హోటల్ టీ టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు తమవద్ద గృహ వినియోగ సిలిండర్ల పాస్బుక్ ల ద్వారా సిలిండర్లు బుక్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. రహస్య ప్రాంతాల్లో దాచి వాడుకుంటున్నట్లు ఏజెన్సీలు వారికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఒకసారి దాడులు చేసి చేతులు దులుపుకోవడంతో ఇక ముందు తనికీలు దాడులు లేకపోవడంతో గృహ వినియోగ సిలిండర్లను కమర్షియల్ కు వాడుకుంటున్నారని స్థానికుల ఆరోపిస్తున్నారు.

విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సివిల్ సప్లై అధికారులు దృష్టి సారించాలని అదనపు ఛార్జీలు వసూలుచేస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కమర్షియల్ కు వాడుతున్న గృహ వినియోగ సిలిండర్ల తీరుపై విసృత దాడులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.