డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ మహిళ అరెస్ట్
హైదరాబాద్: పారడైజ్ ప్రాంతంలో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ మహిళను శుక్రవారం డ్రగ్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకువచ్చి విక్రయిస్తున్న పోలీసులకు సమాచారం అందడంతో జేమ్స్ టెస్లింగ్ యామ్యునాల్‌గా గుర్తించిన నిందితురాలిని సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ ప్రాంతంలోని సన్‌షైన్ హాస్పిటల్ సమీపంలో అదుపులోకి తీసుకొని సుమారు రూ. 2.35 లక్షల విలువైన 7.5 గ్రాముల ఐదు ప్యాకెట్లుగా విభజించబడిన కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. నిందితురాలు ముంబైలో గ్రాముకు రూ. 15,000 చొప్పున కొకైన్‌ను సేకరించి, దానిని హైదరాబాద్‌లో గ్రాముకు రూ. 30,000 చొప్పున అంటే కొన్న ధరకు రెట్టింపు ధరకు విక్రయించడానికి ప్రణాళిక రచించినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలిని తదుపరి చర్యల నిమిత్తం సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.




