రాములవారి రథంపై కూర్చోవద్దంటూ వాగ్వాదం
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గాల మధ్య గొడవ
తూప్రాన్, ఏప్రిల్ 3: మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ లో రామాలయం వద్ద తిరిగే రథo ఉత్సవం పై తలెత్తిన వివాదం తీవ్ర స్థాయికి చేరింది. ఇటు మున్సిపల్ బిఆర్‌ఎస్ చైర్మన్ రజిని రవీందర్ గౌడ్, ఆలయ కమిటీ, కాంగ్రెస్ వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. శ్రీ రామ నవమి వేడుకలలో భాగంగా నిర్వహించే రథోత్సవం పై ఆలయ కమిటీ, బిఆర్‌ఎస్ మున్సిపల్ చైర్ పర్సన్ ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
రథంపై బిఆర్‌ఎస్ పార్టీ కి చెందిన మున్సిపల్ చైర్ పర్సన్ కూర్చోవద్దు అంటు తలెత్తిన గొడవ, పరిస్థితిని చక్కదిద్దేందుకు తూప్రాన్ డిఎస్పి ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మొహరించి బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా నాయకులను ఇంటి నుండి బయటకు రాకుండా ఉదయం నుంచి హౌస్ అరెస్ట్ లు చేశారు. దీంతో ఇరు పార్టీలకు చెందిన నాయకులతో శ్రీరాముని దేవాలయం వద్ద తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ మాట్లాడి శ్రీ రాములవారి రథo పై తలెత్తిన వివాదం కారణంగా ఎవరు రథంపై కూర్చోకూడదని అంగీకారం కుదరడంతో వివాదం సద్దుమణిగింది.




