4 April, 2026 | 3:52 AM

మస్కూరి ఉద్యోగం ఇవ్వాలని.. విద్యుత్ టవర్ ఎక్కి యువకుడి ఆందోళన

04-04-2026 02:05 AM

చేగుంట, ఏప్రిల్ 3 : మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పోలంపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన ప్రదీప్ (35) అనే యువకుడు విద్యుత్ ట్రాన్స్మిషన్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు. తనకు మస్కూరి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టవ్పకి ఎక్కాడు. ప్రదీప్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఐదేళ్ల క్రితం భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదని, అప్పటి నుంచి తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ నరేందర్ గౌడ్, ఎస్త్స్ర చైతన్య కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులతో కలిసి ప్రదీప్ను సురక్షితంగా కిందకు దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎంపీ, ఎమ్మెల్యే వచ్చి తనకు ఉద్యోగం హామీ ఇస్తేనే దిగుతానని ప్రదీప్ మొండికేస్తున్నాడు. ప్రమాదం జరగకుండా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇదే యువకుడు గతంలో 2024 ఆగస్టు 10న కూడా ఉద్యోగం కోసం జియో సెల్ టవర్ ఎక్కినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.