30 August, 2026 | 11:51 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

మెడికవర్‌లో అరుదైన చికిత్సలు

09-07-2026 12:00 AM

ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే గుండె కవాట మార్పిడి

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): సికింద్రాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్స్‌లో ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండానే ట్రా న్స్‌కాథెటర్ అయోర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ (టావీ) ద్వారా గుండె కవాట మార్పిడి విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలి పారు. ఇప్పటివరకు 6 టావీ ప్రక్రియలను విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు. మెడికవర్ హాస్పిటల్స్‌లో నిర్వహిం చిన మీడియా సమావేశంలో డా. ప్రమోద్ కుమార్ కుచులకంటి (చీఫ్ ఆఫ్ కార్డియాలజీ, డైరెక్టర్  స్ట్రక్చరల్ హార్ట్ అండ్ అడ్వానస్డ్ కొరోనరీ ఇంటర్వెన్షన్స్)..

మాట్లాడుతూ ఛాతీని తెరవాల్సిన అవసరం లేకుండా కాలి రక్తనాళం ద్వారా క్యాథెటర్ సహాయంతో కొత్త అయోర్టిక్ వాల్వును అమర్చే టావీ విధానం వల్ల తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకునే అవకాశం ఉం టుందని తెలిపారు. డా. సాగర్ చంద్రశేఖర్ భుయార్ (సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్) మాట్లాడుతూ.. వృద్ధులు, మధుమే హం, మూత్రపిండాల సమస్యలు లేదా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోలేని వారికి టావీ అత్యుత్తమ ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. డా. బాలసుబ్రహ్మణ్యం (హెచ్‌ఓడీ అండ కన్సల్టెంట్  క్రిటికల్ కేర్) మాట్లాడుతూ.. టావీ వంటి చికిత్సల్లో కార్డియాక్ క్రిటికల్ కేర్ బృందం పాత్ర కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంటర్ హెడ్ కృష్ణవేణి, మెడికల్ సూపరింటెండెంట్ డా. ప్రశాంత్ పాల్గొన్నారు.