19 March, 2026 | 2:30 PM

జాతీయ రహదారిపై పసికందు మృతదేహం లభ్యం

19-03-2026 12:00 AM

ఆదిలాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): జిల్లాలోని గుడిహత్నూర్ మండల కేంద్రం లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. నెలలు నిండని మగ పసి కందును గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం జాతీయ రహ దారిపై పడేశారు. తలకు బలమైన గాయాలతో శిశువు మృతి చెందినట్లు స్థానికులు భావిస్తున్నారు.

పసికందు లభ్యమైన 10 మీటర్ల దూరం నుండి రక్తస్రవానికి సంబంధించిన మరకలు ఉండడంతో రోడ్డుపైనే ప్రసవం జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అటుగా వెళ్తున్న వారు రోడ్డుపై పసికందు మృతదేహం చేసి, అం దరూ గుమిగూడారు. వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికు లు పోలీసులకు సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శిశువు మృతదేహం ను రిమ్స్ కు తరలించారు.