1 September, 2026 | 7:18 PM

రెండు పడవలు బోల్తా.. 500 మంది మృతి?

17-07-2026 | 12:36am

నైపిడావ్/సిడ్నీ/పాలు, జూలై 16: మయన్మార్ మైనార్టీలైన రోహింగ్యాలు ప్రయాణిస్తున్న రెండు పడవలు బంగాళాఖాతంలో మునిగిపోయాయి. ఈ ఘటనలో 500 మందికి పైగా మృతి చెందినట్లు అంతర్జాతీయ వలసల సంస్థ, యునైటెడ్ నేషన్స్ హైకమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. ఇండోనేషియాలో కూడా ఓ పడవ బోల్తా పడి ఒకరు మృతి చెందారు. 23 మంది గల్లంతయ్యారు. 46 మంది ప్రాణాలతో బయట పడ్డారు.

రెండు పడవలు జూన్ చివరిలో మయన్మార్‌లోని రాఖైన్ రాష్ట్రతీరం నుంచి బయల్దేరాయి.  ఒక పడవలో 250 మంది ఉండగా.. ప్రయాణం ప్రారంభించిన కొద్దిసేపటికే అది కాంటాక్ట్ కోల్పోయింది. మరో పడవలో 280 మంది ఎక్కారు. అది జులై 8న అయేయార్వాడీ తీరంలో మునిగిపోయింది. గఈ ప్రమాదాలపై అంతర్జాతీయ వలసల సంస్థ, యునైటెడ్ నేషన్స్ హైకమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ ఆందోళన వ్యక్తం చేశాయి.