17 July, 2026 | 12:33 AM

ముడుపులు ముట్టింది ఎవరికి?

17-07-2026 12:31 AM
  1. ఆర్టిజన్ బాబీపై చర్యలేవి!
  2. స్థలం పరిశీలించకుండానే ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు ఏఈ అనుమతి
  3. ఆర్టిజన్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయొచ్చన్న డీఈ
  4. బదిలీలతోనే సరి.. అవకతవకలపై చర్యలు శూన్యం

గజ్వేల్, జూలై 16: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కాశిరెడ్డిపల్లి వ్యవసాయ భూము ల్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ విషయంలో జరిగిన అవకతవకలపై విద్యుత్ శాఖ అధికారులు నామమాత్రపు చర్యలు చేపట్టారు. అక్రమ వసూళ్లకు పాల్పడ్డ ఆర్టిజన్ బాబీని వరదరాజపూర్ సబ్ స్టేషన్ ఆపరేటర్‌గా, ఇప్పటివరకు ఆపరేటర్‌గా వి ధులు నిర్వహించిన జూనియర్ లైన్మెన్ శ్రీకాంత్‌ను వరదరాజపూర్ కాశిరెడ్డిపల్లి లైన్మెన్‌గా విధులు నిర్వహించాలని అధికారు లు ఉత్తర్వులు ఇచ్చారు.

ఆర్టిజన్ బాబి అక్ర మ వసూళ్లపై విజయక్రాంతి దినపత్రిక వరు స కథనాలకు స్పందించిన అధికారులు నా మమాత్రపు చర్యలు తీసుకొని చేతులు దులుపుకున్నారు. 2023లో రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ లైన్‌మెన్‌ల నియామకాలు చేపట్టగా, వరదరాజపూర్‌కు జేఎల్‌ఎం శ్రీకాంత్ ను కేటాయించారు. కానీ అప్పటికే ఆర్టిజన్ బాబి వరదరాజపూర్, కాశిరెడ్డిపల్లి లైన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

తాను లైన్ మన్‌గానే కొనసాగుతానని ఉన్నతాధికారులను మచ్చిక చేసుకోవడంతో జూనియర్ లైన్‌మన్‌గా విధులు నిర్వహించాల్సిన శ్రీకాం త్ వరదరాజపూర్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా ఇప్పటివరకు కొనసాగాడు. ఆర్టిజన్ బా బి అక్రమ వసూళ్లపై విజయ క్రాంతి వరుస వార్తా కథనాలతో తమ ఉద్యోగాలకు ము ప్పు వస్తుందన్న భయంతో ఉన్నతాధికారు లు బాబిని తిరిగి సబ్ స్టేషన్‌లో ఆపరేటర్‌గా విధులు నిర్వహించాలని, జేఎల్‌ఎం శ్రీకాంత్‌ను వరదరాజపూర్, కాశిరె డ్డిపల్లి గ్రామా లకు లైన్‌మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

స్థలం పరిశీలించకుండా అనుమతులు

అక్రమ వసూళ్లకు అలవాటుపడ్డ ఆర్టిజన్ బాబి కాశిరెడ్డిపల్లి శివారులోని గున్నారం రాణి వ్యవసాయ క్షేత్రంలో కూడా ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు రూ.3.80 లక్షలకు బేరం కుదుర్చుకొని పనులు నిర్వహించాడు. సిం గం వెంకటేశం, ఆర్టిజన్ బాబీలకు రూ.3.80 లక్షలు ఇచ్చానని రాణి వద్ద పనిచేసే నీలకంఠం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ మేరకు విజయ క్రాంతిలో వరుస వార్తా కథనాలకు స్పందించిన వెంకటేష్, ఆర్టిజన్ బాబీలు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు.

ఓ సంద ర్భంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటులో తన ప్ర మేయం లేదని, అంతా మా ఏఈ కే తెలుసని వెల్లడించాడు. కాగా ప్రస్తుతం ఆర్టిజన్ బాబీని లైన్మెన్ గా కాకుండా సబ్ స్టేషన్ లో ఆపరేటర్ గా విధులు నిర్వహించాలని ఆదేశించడం విచారణను పక్కదోవ పట్టించడా నికేనని అర్థమవుతుంది. ట్రాన్స్‌ఫార్మర్ మం జూరు చేయడానికి ముందు స్థానిక విద్యుత్ శాఖ ఏఈ సుధీర్ స్థలాన్ని, రైతుల వివరాలను పరిశీలించకపోవడం గమనార్హం.

ఆర్టిజ న్ బాబి చెప్పిన ప్రకారమే ఏఈ సుధీర్ అనుమతిచ్చినట్టు మంజూరు పత్రాలను పరిశీలి స్తే అర్థమవుతుంది. ఏఈకి కూడా వసూళ్లలో వాటా ఉందని స్పష్టం అవుతుంది. నీలకంఠం వద్ద తీసుకున్న డబ్బులు ఎవరికి అందాయో అధికారులు ఇంకా తేల్చాల్సి ఉంది. 

ఆర్టిజన్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయొచ్చు: డీఈ

బాబిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ గజ్వేల్ డీఈ భాను ప్రకాష్ వెల్లడించారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడంలో ఏఈ సుధీర్ పర్యవేక్షించలేదని డిఈ దృష్టికి తీసుకురాగా, ఆర్టిజన్ కూడా ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయొచ్చని సమాధానం ఇచ్చారు.