కోటి రూపాయలతో ఏర్పాటు చేసిన 8 ఎంవీఏ ట్రాన్స్ ఫార్మర్‌ను ప్రారంభించిన ప్రభుత్వ విప్
రుద్రంగి జులై16 (విజయక్రాంతి): రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని సబ్స్టేషన్ లో దాదాపు కోటి రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన 8ఎంవిఏ ట్రాన్స్ ఫార్మర్ ను రైతులతో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.గతంలో 5ఎంవిఏ ట్రాన్స్ ఫార్మర్ ఉండేదని దానివల్ల రైతులకు లో వోల్టేజ్ సమస్య ఏర్పడిందని తన దృష్టికి తీసుకురావడం జరిగిందని వెంటనే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో మాట్లాడి 8ఎంవిఏ ట్రాన్స్ ఫార్మర్ తీసుకురావడం జరిగిందని అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడవ 8ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్స్ రుద్రంగిలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
గత బిఆరెస్ ప్రభుత్వం సబ్స్టేషన్లను మరమ్మతులు చేయకుండా పడవుపెట్టారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సబ్స్టేషన్లకు మహర్దశ వచ్చిందని అలాగే రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విదంగా వేములవాడ నియోజకవర్గనికి నూతన సబ్స్టేషన్ల కు మంజూరు ఇవ్వడం జరిగిందని అన్నారు. రైతుల వ్యవసాయానికి కరెంట్ ప్రాబ్లమ్ ఉందని తెలుస్తే చాలు వెంటనే అధికార యంత్రాంగం అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరించి కరెంట్ ఇవ్వడం జరిగుతుందని అన్నారు. రైతుల వ్యవసాయనికి సంబంధించిన అన్ని షౌకార్యాలు కల్పిస్తున్నామని ఇది రైతు ప్రభుత్వామని అన్నారు.






