తెలంగాణ బీజేపీ రాష్ట ప్రతినిధిగా ఇంద్రసేన్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 1౪(విజయక్రాంతి): టెక్నాలజీ, సోలార్ ఎనర్జీ , రియల్ ఎస్టేట్ రంగాల్లో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం కలిగిన వ్యాపారవేత్త,పెట్టుబడిదారుడు బి. ఇంద్రసేన్ రెడ్డి (ఐఎస్‌ఆర్)ను తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రతినిధిగా నియమించారు. ప్రకృతి, విశ్వశక్తిపై గాఢమైన విశ్వాసం కలిగిన ఆయన, నిజాయితీతో, సమానత్వ భావంతో తెలంగాణ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ బాధ్య తను అప్పగించి నందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షు డు ఎన్ రాంచందర్‌రావుకి ఆయన కృతజ్ఞతలు తెలి పారు. తనపై విశ్వాసం ఉంచి రాష్ట్ర ప్రతినిధి బాధ్యతను అప్పగించినందుకు ఆయనకు ధన్య వాదాలు తెలిపారు. ఇంద్రసేన్ రెడ్డి లఘు ఉద్యోగ్ భారతి, భార త్ గ్లోబల్ ఇండస్ట్రిస్ ఫోరం, స్వవలంభి భారత్ అభియాన్ వంటి సంస్థలతో అనుబంధంగా పనిచేస్తూ, పారిశ్రామిక వేత్తల అభివృద్ధి, విధాన పరిరక్షణ, వ్యాపార సహకారం ద్వారా వికసిత భారత్ లక్ష్య సాధనలో భాగస్వామ్యమవుతున్నారు.




