మ్యాట్రిమోనీ పేరుతో మోసం వ్యక్తి అరెస్ట్
20 మంది మహిళలతో కోట్ల రూపాయలు వసూలు
శేరిలింగంపల్లి, మే 19 (విజయక్రాంతి): పెళ్లి కలలు కన్న మహిళల భావోద్వేగాలను ఆయుధంగా చేసుకొని కోట్లాది రూపాయలు మోసం చేసిన ఓ అంతర్రాష్ట్ర మ్యాట్రిమోనీ కిలాడీని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు తెలుగు రాష్ట్రాల మహిళల్లో తీవ్ర కలకలం సృష్టించింది. నిందితుడు మందా వెంకట కమేషు (అలియాస్ కమేష్) పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలానికి చెందినవాడు. నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి సైట్లలో పెట్టాడు.
సంపన్నవర్గానికి చెందిన వాడుగా ప్రొఫైల్ తయారు చేసి పెట్టడంతో చాలామంది ఆకర్షితులయ్యేవారు. ఆకర్షితులైన వారితో టచప్‌లో ఉంటూ ఎమోష నల్‌గా దగ్గరయ్యేవాడు. నమ్మకం కుదిరాక డబ్బు వసూలు చేసేవాడు. ఇలా దాదాపు 20 మంది మహిళల వద్ద నుంచి కోటిరూపాయల పైనే గుంజాడని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇతనిపై తెలంగాణలో 12 కేసులుం డగా, ఆంధ్రప్రదేశ్‌లో 8 కేసులు నమోదయ్యాయి. మోసం చేయగా వచ్చిన డబ్బుతో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు, గోవా క్యాసినోలు, విలాసవంతమైన ఖర్చులు చేసేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రొఫైల్ ఫోటో లు, ఉద్యోగ వివరాలు, ఆస్తి సమాచారం పంచుకోవద్దని డీసీపీ టి. సాయిమనోహర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






