15 March, 2026 | 1:54 AM

కోలన్ శంకర్‌రెడ్డికి అభినందనల వెల్లువ

15-03-2026 12:25 AM

బడంగ్ పేట్, మార్చి 14 (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర కో ఆపరేటివ్ సెల్ కన్వీనర్ గా నియమితులైన బీజేపీ రాష్ట్ర నాయకులు, సింగిల్ విండో మాజీ చైర్మన్ కోలన్ శంకర్ రెడ్డిని పలువురు శనివారం వారి నివాసంలో కలిసి శాలువతో సత్కరించి పుష్ప గుచ్చం అందజేసి, స్వీట్ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. దాదాపు 35 ఏళ్లుగా బీజేపీలో కొనసాగుతూ.. ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూనే, పార్టీ బలోపేతం కోసం నిరంతరం పనిచేస్తున్నట్లు చెప్పారు. పార్టీ నా సేవలను గుర్తించి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలు పుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రామిడి శేఖర్ రెడ్డి, సంబే రవి కుమార్, పెద్దింటి సుధాకర్, నాలిక సూర్య ప్రకాష్, మునగాల ప్రభాకర్‌రెడ్డి, రామిడి మహేందర్ రెడ్డి, శ్యామా వినోద్ బాబు తదితరులు పాల్గొన్నారు.