19 May, 2026 | 11:24 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

భక్తిశ్రద్ధలతో రంజాన్‌ను జరుపుకోవాలి

15-03-2026 12:22 AM

అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

ముషీరాబాద్, మార్చి 14(విజయక్రాంతి): ముస్లిం సోదరులు రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని అంబ ర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ఈ మేరకు శనివారం అంబర్ పేట నియోజకవర్గం పరిధిలోని గోల్నాక డివిజన్ పరిధి లోని మసీద్ కరీమా ఒమర్జ్ (జిందా మస్జిద్), మసీ ద్-ఇ-గుల్జార్ ఇబ్రహీం ఓ ఇస్మాయిల్ (క్వాద్రి బాగ్ మసీద్) వద్ద నిర్వహించిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్ర మంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు స్థానిక ప్రజలను ఆప్యాయంగా కలుసుకుని వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అర్హులైన కుటుంబా లకు రంజాన్ తోఫా ప్యాకెట్లను పంపిణీ చేసి పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.