ఇంద్రేశంలో ఆగని అక్రమ నిర్మాణాలు!
- పట్టించుకోని మున్సిపల్ అధికారులు
- రాజకీయ నేతల ఒత్తిడితో అధికారుల మౌనం ?
- నోటీసులతో చేతులు దులుపుకొంటున్న వైనం
పటాన్చెరు, మే 19 :పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో అ క్రమ కట్టడాలపై అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో స్థానికులు ఆ గ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు ఒక న్యా యం. పెద్దలకు ఒక న్యాయామా అని బాహాటంగా ప్రశ్నిస్తున్నారు. ఇంద్రేశంలో జరుగు తున్న అక్రమ కట్టడాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని పిఎన్‌ఆర్ కాలనీ, ఆర్ కె నగర్, ఎన్నారై, సాయి, నవ్య కాలనీ ల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్ర మ నిర్మాణాలను చేపడుతున్నా అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
సెట్ బ్యా క్ నిర్మాణం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగుతున్నా చర్యలు తీసుకోవడం లేదు. అక్రమ నిర్మాణాలపై ఫి ర్యాదులు చేస్తే నామమాత్రంగా నోటీసులు జారీ చేసి కాలం వెళ్లదీస్తున్నారు. పటాన్ చెరు దౌల్తాబాద్ ప్రధాన రోడ్డులోని ఇం ద్రేశం రోడ్డు ఇరువైపుల సెల్లార్లతో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. గతంలో గ్రా మ పంచాయతీ ఉన్నప్పుడు చేపట్టిన అక్ర మ, అనుమతిలేని కట్టడాలను తూతూ మం త్రంగా కూల్చివేతలు చేపట్టారు. కానీ మున్సిపల్గా రూపాంతం చెందినప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపంతో అక్రమ నిర్మాణాల జోరు ఇంకా పెరుగుతూ వచ్చింది.
అధికారుల మౌనం దేనికి సంకేతం..?
బిల్డర్లకు, అక్రమ నిర్మాణదారులకు స్థాని క ప్రజాప్రతినిధులు అన్ని విధాలుగా అండ గా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ పరమైన, అధికారి కంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. విచ్చలవిడిగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై అధికారులు మౌనం పాటించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే అదనునగా అక్రమార్కులు, బిల్డర్లు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






