20 May, 2026 | 1:51 AM

కారులో చెలరేగిన మంటలు

20-05-2026 12:40 AM

సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు

ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న టాక్సీ

ఇచ్చోడ రహదారిపై ఘటన

ఆదిలాబాద్, మే 19 (విజయక్రాంతి): రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు బయట దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ఇచ్చోడ రహదారిపై జరిగిన ప్రమాదంలో కారులో నుంచి మంటలు ఉవ్వెత్తున ఎగసిపడగా కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది.

ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగగా, గమనించిన స్థానికులు కారులో ఉన్న ప్రయాణికులను సుర క్షితంగా బయటకు తీసుకురావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం మంటలు వేగంగా వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం ఎలా జరిగింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.