calender_icon.png 15 February, 2026 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైవోల్టేజ్ ఫైట్

15-02-2026 12:34:14 AM

నేడు భారత్, పాక్ మ్యాచ్

గెలిచిన జట్టుకు సూపర్ బెర్త్

అభిషేక్ శర్మ రీఎంట్రీ

మ్యాచ్‌కు వర్షం ముప్పు

భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే అది ఆట కాదు వేట...మైదానంలో జరిగే యుద్ధం.. ఇక్కడ ఆట కంటే భావోద్వేగాలే ఎక్కువ హైలెట్ అవుతాయి. సాధారణ అభిమాని నుంచి ప్రధాని మంత్రి వరకూ అందరి దృష్టీ ఈ మ్యాచ్‌పైనే..  ఫార్మాట్ ఏదైనా, ఆడుతోంది ఎక్కడైనా భారత్, పాకిస్తాన్ తలపడుతున్నాయంటే చాలు ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. ఇరు జట్ల ఆటగాళ్లు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆడే మ్యాచ్ ఇది.. అటు అభిమానులు కూడా అంతే... ఇలాంటి ఆసక్తికరపోరుకు కొలంబో వేదికగా నిలవబోతోంది. ఆదివారం రాత్రి జరిగే ఈ ఫైనల్ కాని ఫైనల్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

కొలంబో, ఫిబ్రవరి 14 : క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది.. వరల్ క్రికెట్‌లో హైఓల్టేజ్ ఫైట్‌కు కౌంట్ డౌ న్ మొదలైంది.. చిరకాల ప్రత్యర్థుల మధ్య క్రికెట్ యుద్ధానికి కొలంబో సిద్ధమైంది. చాలా ఏళ్లుగా ఇరు దేశాల మధ్య ద్వై పాక్షిక సిరీస్‌లు జరగ డం లేదు.  కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడతున్నాయి. ఆసియాకప్, ప్రపంచకప్‌లలో మాత్రమే చిరకాల ప్రత్యర్థుల క్రికెట్ సమరాన్ని అభిమానులు చూస్తున్నారు.

గత ఏడాది ఆసియాకప్ నుంచి భారత్, పాక్ మధ్య నో షేక్ హ్యాండ్ వివాదం ఈ పోరును మరోస్థాయికి తీసుకెళ్లింది. పహల్గామ్ దాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు భారత క్రికెటర్లు నిరాకరించడంతో పాక్ నానా హంగామా చేసింది. ఆసియాకప్ ట్రో ఫీని సైతం ఏసీసీ ఛైర్మన్‌గా ఉన్న పాక్ మంత్రి మోహ్సిన్ నఖ్వీ నుంచి తీసుకునేందుకు ఒప్పుకోలేదు. ఇటీవల బంగ్లాదేశ్ తో భారత్ వివాదంలో అనవసరంగా జోక్యం చేసుకున్న పాక్ క్రికెట్ బోర్డు ఈ మ్యాచ్ ను బహిష్కరిస్తున్నామంటూ నానా హడావుడి చేసింది. చివరికి ఐసీసీ వార్నింగ్ ఇవ్వడం, బ్రాడ్ కాస్టర్లు భారీ నష్టపరిహారం వసూలు చేస్తామని చెప్పడంతో వెనక్కి తగ్గి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది.

ఈ సారి కూడా పాక్ క్రికెటర్లతో నో షేక్ హ్యాండ్ విధానానికే భారత్ కట్టుబడి ఉందని సమాచారం. టాస్ సమయంలోనూ, మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ క్రికెటర్లతో షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై పీసీబీ ఎంత ఓవరాక్షన్ చేసినా తగ్గేదే లేదని భారత్ డిసైడ్ అయినట్టు స్పష్టమవుతోంది. మరోవైపు పాక్‌తో మ్యాచ్ కోసం భారత తుది జట్టు కూర్పుపైనే అందరి చూపు ఉం ది. అస్వస్థత కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన అభిషేక్ శర్మ పాక్‌పై బరిలోకి దిగడం ఖాయమైంది. కెప్టెన్ సూర్యకుమార్ యాద వ్ అభిషేక్ ఆడతాడని హింట్ ఇచ్చాడు.

అటు పాక్ కెప్టెన్ సల్మా అఘా కూడా అభిషేక్ ఆడితేనే మజా అంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం కోలుకుని ఫిట్‌నెస్ సాధించిన అభిషేక్ శర్మ మరోసారి పాక్‌పై విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అతని రీఎంట్రీతో సంజూ శాంసన్‌పై వేటు పడ నుంది. అలాగే కొలంబో పిచ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎక్స్ ట్రా స్పిన్నర్‌తో ఆడొచ్చు. దీంతో రింకూ సింగ్ లేదా అర్షదీప్‌లలో  ఒకరిని తప్పించి వాషింగ్టన్ సుందర్ లేదా కుల్దీప్ యాదవ్‌లలో ఒకరిని తీసుకోనున్నారు. మిగిలిన జట్టులో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. ఇషాన్ కిషన్, హార్థిక్ పాండ్యా మంచి ఫామ్‌లో ఉండగా.. సూర్యకుమార్, తిలక్ వర్మ కూడా చెలరేగితే తిరుగుండదు. బౌలింగ్‌లో బుమ్రా అంచనాలు నిలబెట్టుకోవాల్సి ఉంది.

మరోవైపు ఈ మ్యాచ్‌లో పాక్ జట్టు కూడా పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. కప్ గెలవకున్నా భారత్‌ను ఓడిం చడమే ముఖ్యమని ఆ దేశ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే టీమిండియాను నిలువరించాలంటే పాక్ అంచనాలకు మించి రాణించాల్సిందే. అయితే ఎప్పుడెలా ఆడుతుందో తెలియని పాక్ ను తక్కువ అంచనా వేస్తే మాత్రం భారత్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. దీంతో భారత్ తన అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించి పాక్‌ను చిత్తు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం రెండు విజయాలతో సూపర్ 8కు చేరువైన భారత్ పాక్ ను ఓడిస్తే బెర్త్ ఖరారు చేసుకుంటుంది. 

గత రికార్డులు :

పాక్‌తో ఎప్పుడు మ్యాచ్ జరిగే టీమిండియానే ఫేవరెట్. ఎందుకంటే ఐసీసీ టోర్నీల్లో ఆ జటు పై భారత్‌దే ఆధిపత్యం. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు 8 సార్లు తలపడితే భారత్ 7 మ్యాచ్‌లలో గెలిచింది.

పిచ్ రిపోర్ట్ :

కొలంబో ప్రేమదాస స్టేడియం బ్యాటర్లకు కాస్త అనుకూలించినా ఓవరాల్‌గా స్పిన్నర్లే కీలకం కాబోతున్నారు. అందుకే రెండు జట్లు స్పిన్ బలంతోనే బరిలోకి దిగనున్నాయి. .

వర్షం ముప్పు :

కొలంబోలో ఆదివారం సాయంత్రం నుంచి వర్షం కు రిసే అవకాశముంది. వర్షంతో మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరొక పాయింట్ లభిస్తుంది.

తుది జట్లు అంచనా

భారత్ : అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూసింగ్/వాషింగ్టన్ సుందర్/కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, బుమ్రా

పాకిస్థాన్ : ఫర్హాన్, సయీం అయూబ్, సల్మన్ అఘా(కెప్టెన్), బాబర్ అజామ్, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్/ఫకర్ జమాన్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రాఫ్, షాహీన్ అఫ్రిది, ఉస్మాన్ తారిఖ్, అబ్రార్ అహ్మద్