11 June, 2026 | 2:13 AM

ఆగస్టులో భారత్, శ్రీలంక టెస్ట్ సిరీస్

11-06-2026 01:02 AM

గాలె, కొలంబో వేదికలు

టీ20 సిరీస్‌పై లేని స్పష్టత

ముంబై, జూన్ 10 : భారత క్రికెట్ జట్టు బిజీ షెడ్యూల్‌లో మరో విదేశీ పర్యటన ఖరారైంది. ఆగస్టులో టీ మిండియా శ్రీలంక టూ ర్‌కు వెళ్లబోతోంది. ఈ పర్యటనలో ఇరు జట్లు రెండు టెస్టుల సిరీస్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్‌లకు గాలె, కొలంబో ఆతిథ్యమివ్వనున్నాయి. 2017 తర్వాత లంక గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడనుండడం భారత్‌కు ఇదే తొలిసారి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 27 సైకిల్‌లో భాగంగా ఈ సిరీస్ జరబోతోంది.

మొదటి టెస్ట్ ఆగస్టు 15 నుంచి 19 వరకూ గాలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోనూ, రెండో టెస్ట్ ఆగస్టు 23 నుంచి 27 వరకూ కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లోనూ జరగనున్నాయి. భారత్ చివరిసారిగా లంక గడ్డపై ఆడిన సిరీస్‌ను 3 క్లీన్ స్వీప్ చేసింది.

దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత అక్కడ రెడ్ బాల్ క్రికెట్ మ్యా చ్‌లు ఆడనుండడంతో అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ఈ టూర్‌లో మూడు టీ20 మ్యాచ్‌లు కూడా నిర్వహించే అవకాశం ఉం దని తెలుస్తోంది. దీనిపై లంక బోర్డు ఇప్పటికే ప్రతిపాదనలు పంపించగా బీసీసీఐ ఇంకా స్పందించలేదు. టెస్ట్ సిరీస్ షెడ్యూల్‌పైనా, టీ20 సిరీస్ నిర్వహణపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.