బెన్ స్టోక్స్‌పై వేటు
కొత్త కెప్టెన్‌గా జో రూట్
నైట్ క్లబ్ వివాదంతో ఈసీబీ చర్యలు
ఆట్కిన్సన్‌నూ తప్పించిన బోర్డు
లండన్, జూన్ 10: నైట్ క్లబ్‌లో రచ్చ రచ్చ చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌పై వేటు పడింది. ఊహించినట్టుగానే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అతనిపై చర్యలు తీసుకుంది. న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్ నుంచి అతన్ని తప్పించింది. ఇదే వివాదంలో స్టోక్స్‌తో పా టు ఉన్న ఆట్కిన్సన్‌పైనా వేటు వేసింది. జట్టు నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్టు ఈసీబీ తెలిపింది. స్టోక్స్ స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌గా జో రూట్‌ను నియమించింది.
వైస్ కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్ ఉన్నప్పటకీ సీనియర్ కావడంతో రూట్‌కు బాధ్యతలు అప్పగించింది. ఇదిలా ఉంటే లార్డ్స్ టెస్టులో విజయం సా ధించిన తర్వాత స్టోక్స్, ఆట్కిన్సన్‌లు లండన్‌లోని ఓ నైట్ క్లబ్‌కు వెళ్లారు. అక్కడ ఓ రగ్బీ ఆటగాడితో గొడవ పడినట్టు సమాచారం. జట్టు నిబంధనలు ఉల్లంఘించి అర్థరాత్రి బయటకు వెళ్లినందు కు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో రెండో టెస్ట్ నుంచి ఇద్దరినీ తప్పించారు. స్టోక్స్ స్థానంలో జోర్డన్ కాక్స్, ఆట్కిన్సన్ స్థా నంలో జోఫ్రా ఆర్చర్ జట్టులోకి వచ్చారు. కాగా ఈ వివాదం జరిగిన తర్వాత స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించబో తున్నట్టు ప్రచారం జరుగుతోంది.






