హార్థిక్‌కు మళ్లీ గాయం
11-06-2026 01:04 AM
ఆప్ఘన్‌తో సిరీస్‌కు దూరం
బెంగళూరు, జూన్ 10 : అఫ్ఘానిస్థాతో వన్డే సిరీస్‌కు ముందు భార త్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే విరాట్ కోహ్లీ గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకోగా, తాజాగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం తో దూరమయ్యాడు. ఇటీవల బీసీసీఐ సెం టర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేసిన హార్దిక్ 11న జట్టుతో చేరాల్సి ఉంది. అయితే మరోసారి అతను గాయపడ్డాడు. దీంతో ముం దు జాగ్రత్తగా అతడిని ఈ సిరీస్‌కు దూరంగా ఉంచాలని బీసీసీఐ నిర్ణయించింది. ప్రస్తుతం హార్దిక్ పాం డ్యా గాయం తీవ్రత తక్కువగానే ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.






