7 March, 2026 | 6:36 PM

పెంచిన సిలిండర్ ధరలను తగ్గించాలి

07-03-2026 04:47 PM

నిర్మల్,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై భారం మోపి విధంగా సిలిండర్ ధరలను పెంచిందని వెంటనే తగ్గించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ డిమాండ్ చేశారు. శనివారం తిరుమలలో ఆయన మాట్లాడుతూ... కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ప్రజలపై భారం మోపడం సరికాదన్నారు. వెంటనే సిలిండర్లను తగ్గించాలని లేనిపక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామన్నారు.