16 July, 2026 | 1:02 AM

దేశీయ మొబైల్ ఫోన్ తయారీకి ప్రోత్సాహం

16-07-2026 12:47 AM
  1. రూ.62,500 కోట్లతో పీఎల్‌ఐ పథకం
  2. ఆమోదించిన కేంద్ర మంత్రివర్గ సమావేశం

న్యూఢిల్లీ, జూలై 15: దేశీయ ఉత్పత్తి, ఎగుమతులు, స్థానిక విలువ జోడింపును ప్రోత్స హించేందుకు కేంద్ర మంత్రివర్గం రూ.62, 500 కోట్ల మొబైల్ ఫోన్ తయారీ పథకాన్ని ఆమోదించింది. ఐదేళ్ల ఈ పథకం, రూ.39 లక్షల కోట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుని, తయారీ, విడిభాగాల సేకరణ, ఆర్‌అండ్‌డీకి ప్రోత్సాహకాలను అందిస్తుంది.

దేశీయ మొ బైల్ ఫోన్ ఉత్పత్తిని పెంచడం, స్థానిక విలువ జోడింపును పెంపొందించడం, ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా భారతదేశ స్థానా న్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్న రూ. 62,500 కోట్ల మొబైల్ ఫోన్ తయారీ పథకానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో, 2026 ఆర్థిక సంవత్సరం నుంచి 2030 ఆర్థిక సంవత్సరం వరకు ఐదేళ్ల కాలపరిమితితో ఈ పథకానికి ఆమో దం లభించింది.

అలాగే సెమీకండక్టర్లు, ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి పలు ప్రాజె క్టులను కూడా క్యాబినెట్ ఆమోదించింది. కాగా గతంలో మొబైల్ ఫోన్ల కోసం భారత్ ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ఆధారపడాల్సి వచ్చేది. ఈ క్రమంలోనే దేశీయంగా ఉత్పత్ని పెంచేందుకు కేంద్ర ప్రభు త్వం పీఎల్‌ఐ పథకాన్ని తీసుకు వచ్చింది. ఈ పథకం కింద, భారతదేశంలో మొబైల్ ఫోన్ల ను తయారు చేసే కంపెనీలు అర్హత గల అ మ్మకాలపై 2.25% నుంచి 5% వరకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను అందుకుంటాయి.

తయారీదారులు ప్రధాన విడి భాగాలు, ఉప-అసెంబ్లీలను దేశీయంగా సేకరించినందుకు 1.5% వరకు అదనపు ప్రో త్సాహకాన్ని కూడా పొందవచ్చు, ఇది సరఫరా గొలుసులో మరింత స్థానికీకరణను ప్రోత్సహిస్తుంది. భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాం డ్లను ప్రోత్సహించేందుకు, ఉత్పత్తి రూపకల్పన, పరిశోధన, అభివృద్ధికి సంబంధించిన అర్హత గల అమ్మకాలపై ప్రభుత్వం అదనం గా మూడు శాతం ప్రోత్సాహకాన్ని అందిస్తుంది.

ఈ పథకం తన ఐదేళ్ల కాలపరి మితిలో సుమారు రూ. 39 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల ఉత్పత్తిని సృష్టిస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది . ఇది సుమారు 60 వేల ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని, తద్వారా ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని కూడా అంచనా వేయబడిం ది. భారత్ అంతర్జాతీయ చిప్ తయారీ హబ్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్య లు ముమ్మరం చేసింది.

ఇందులో భాగంగానే రూ.1.27 లక్షల కోట్లతో సెమీకాన్ 2.0 ప్రోగ్రామ్‌ను ఆమోదించింది. అలాగే వారణాసిలో రెండు మెగా కారిడార్లకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వారణాసి రింగ్‌రోడ్, 31వ జాతీయ రహదారిని కలుపుతూ 43.21 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడా ర్‌కు క్యాబినెట్ అనుమతిలిచ్చింది. రూ.10, 998 కోట్లతో ఈ నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే ఎన్‌హెచ్ 19 రింగ్‌రోడ్ మధ్య రూ.14,467 కోట్లతో ౬ వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎలివేటెడ్ కారిడార్‌ను ఆమోదించింది.