దద్దరిల్లిన ఇరాన్
- అమెరికా ఏకదాటిగా ఏడు గంటలు దాడులు
- ఏడుగురు సైనికులు మృతి.. 260 మందికి గాయాలు
- గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకారదాడులు
టెహ్రాన్, జూలై15: అమెరికా దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. మంగళవారం రాత్రి నుంచి ఏడు గంటల పాటు ఇరాన్‌పై అమెరికా ఏకదాటిగా దాడు లు చేసింది. హర్మూజ్ జలసంధి, ఇరాన్ తీరప్రాంతాల సమీపంలోని సైనిక, నౌక, వైమా నిక స్థావరాలు, రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో ఢీకొట్టింది. హోర్ముజ్ తీరంలోని ఇరాన్ గ్రేటర్ తున్బ్ ద్వీపంపై గంటన్నర పాటు బాంబులతో విరుచుపడింది. అలాగే 388వ మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ బ్యారక్స్‌పై కూడా క్షిఫణులను వేసింది. ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అమెరికా దాడుల్లో 388వ మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ బ్యారక్స్ ధ్వంసమైందని ఇరాన్ తెలిపింది.
ఏడుగురు సైనికులు మృతి చెందారని, 260 మందికిపైగా గాయాలయ్యాని ఐఆర్‌జీసీ ప్రకటించిం ది. మరోవైపు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది. మరోవైపు ఇరాన్ చర్చలకు రాకపోతే మరిన్ని దాడులు చేస్తామని, ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికా బుధవారం రాత్రి ఏడు గంటల వ్యవధి లో డజన్ల కొద్దీ లక్ష్యాలపై వరుస దాడులు చేసిందని సైనిక సెంట్రల్ కమాండ్ తెలిపింది.
ఆ తర్వాత, పగటిపూట ఇరాన్‌పై దాడులను పునఃప్రారంభించింది. హోర్ముజ్ జలసంధిలో నౌకలపై టెహ్రాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఈ దాడులు చేశామని అమెరికా పేర్కొంది. హోర్ముజ్‌లో వాణిజ్య నౌకల లక్ష్యంగా ఇరాన్ చేస్తోన్న దాడుల సామర్థ్యాన్ని మరింత దెబ్బతీసేందుకు అమెరికా యుద్ధ విమానాలు, డ్రోన్లు, నౌకల నుం చి ఆయుధాలను ప్రయోగించాం. ఏడు గం టల పాటు జరిగిన ఈ దాడుల్లో ఇరాన్ క్షిపణి, డ్రోన్ నిల్వలు, నౌకా సామర్థ్యాలు తీర ప్రాంత రక్షణ వ్యవస్థలను టార్గెట్ చేశాం’ అని యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.
ఇరాన్ ఓడరేవులకు రాకపోకలు సాగించే నౌకలపై అమెరికా సైన్యం దిగ్బంధనాన్ని పునః ప్రారంభించిన రోజే ఈ దాడులు జరిగాయి. సిస్తాన్, బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని, ట్యాంకులు సాయుధ వాహనాలను నడిపే ఇరాన్ 388వ మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్‌కు చెందిన బ్యారక్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఒక దాడి జరిగిందని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ తెలిపింది.
ఈ దాడిలో అమెరికన్లు కనీసం 13 క్షిపణులను ప్రయోగించారని, మృతులలో ఏడుగురిలో నిర్బంధ సైనికు లు, వృత్తిపరమైన సైనికులు ఉన్నారని, 260 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బుధవారం తెల్లవా రుజామున బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌పై దాడులు చేశామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ పొరుగున ఉన్న గల్ఫ్ అరబ్ దేశాలపై డజన్ల కొద్దీ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించామని సెంట్రల్ కమాండ్ పేర్కొన్నారు. హర్మోజ్‌గాన్ నగరంలో రేంజర్ పోస్టుపై జరిగిన దాడిలో ముగ్గురు మృతిచెందారని వెల్లడించింది. ఇరాన్ చేపట్టిన దాడిలో తమ నేవీకి చెందిన నలుగురు సిబ్బంది గాయపడ్డారని కువైట్ తెలిపింది.
చర్చలకు రాకపోతే మరిన్న దాడులు : ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తతంగా మారుతున్నాయి. హోర్ముజ్‌లో నౌకలపై దాడులకు ప్రతీస్పందనగా ఇరాన్ పోర్టులను అమెరికా దిగ్భందించింది. మరోవైపు ఇరాన్ చర్చలకు రాకపోతే వచ్చేవారం లో ఆ దేశంలోని విద్యుత్ కేంద్రాలు, వంతెనల వంటి ప్రజా మౌలిక వసతులను ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇక వచ్చే వారం నుంచి పరిస్థితి అధ్వానంగా మారుతుందని ప్రకటించారు.
విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై దాడులు ప్రారంభిస్తామని, చర్చలకు వస్తేనే వాటిని నిలిపివేస్తామని హెచ్చరిం చారు. ఒప్పందం కుదర్చుకోకుంటే ఇరాన్‌లో ఎవరూ మిగలరన్న ట్రంప్, దేశాన్ని నాశనం చేస్తామని వ్యాఖ్యానించారు. ఇరాన్ అధికారుల తో జరిగిన తాజా సంప్రదింపుల్లో అమెరికా ప్రతినిధులకు, ఈ సందేశాన్ని పంపినట్లు ట్రంప్ వెల్లడించారు.






