అస్సాం రైఫిల్స్ క్యాంప్‌పై మూక దాడి
- మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు
- సేనాపతి పట్టణంలో భద్రతా క్యాంప్‌పై రాళ్ల వర్షం
- రైఫిల్స్ వాహనాలకు నిప్పు
- రంగంలోకి పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు
- గాల్లోకి కాల్పులు, టియర్ గ్యాస్ గ్రెనేడ్ల ప్రయోగం
ఇంఫాల్, జూలై 15: మణిపూర్‌లోని సేనాపతి జిల్లాలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. మంగళవారం రాత్రి సేనాపతి పట్ట ణంలో ఒక్కసారిగా శాంతిభద్రతల సమస్య ఏర్పడింది. అక్కడి అస్సాం రైఫిల్స్ క్యాంప్‌ను ఒక పెద్ద గుంపు లక్ష్యంగా చేసుకుంది. ఆయుధాలు ధరించిన ఎన్‌ఎస్‌సీఎన్ (ఐఎం) ఉగ్ర వాద క్యాడర్ల కదలికలపై నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో రక్షణ బలగాలు ఆ ప్రాంతంలో భారీ గాలింపు చర్యలు చేపట్టాయి.
ఈ గాలింపు చర్యలను వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజలు హింసకు దిగా రు. కేంద్ర ప్రభుత్వంతో ఎన్‌ఎస్‌సీఎన్ (ఐఎం) సంస్థ 1997 నుంచి కాల్పుల విరమణ ఒప్పందంలో ఉంది. అయితే ఈ సంస్థ కు చెందిన సాయుధ సభ్యులు నిర్దేశిత క్యాం పుల వెలుపల తిరుగుతున్నారు. వారు యూ నిఫాంలు ధరించి, ఆయుధాలతో సంచరిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వచ్చా యి. ఇది అధికారిక కాల్పుల విరమణ నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. దీనిపై అధికారిక కాల్పుల విరమణ పర్యవేక్షణ కమిటీకి కూడా రక్షణ శాఖ సమాచారం అందిం చింది.
ఈ ఉల్లంఘనలను అరికట్టేందుకు సైన్యం రంగంలోకి దిగింది. మకుయిలాంగ్డి, ఓక్లాంగ్ గ్రామ పరిసరాల్లో అస్సాం రైఫిల్స్ బలగాలు గాలింపు చేపట్టాయి. హుత్రోంగ్ వంతెన సమీపంలో సైన్యం కదలికలను స్థా నికులు అడ్డుకున్నారు. నిరసనకారులలో పెద్ద సంఖ్యలో మహిళలు కూడా చేరారు. ఈ సమయంలో భద్రతా బలగాలు అత్యంత సంయమనం పాటించాయి. స్థానిక ప్రతినిధులతో అధికారులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. గ్రామస్థుల అనుమతి లేకుండా తాము గ్రామాల్లోకి ప్రవేశించబోమని హామీ ఇచ్చారు.
కేవలం శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ చర్యలని స్పష్టం చేశారు. సైన్యం ఇచ్చిన హామీలను స్థానికులు పట్టించుకోలేదు. రాత్రి 9 గంటల సమయంలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. సేనాపతి పట్టణంలో భారీగా జనం గుమిగూడారు. అక్కడి నుంచి అస్సాం రైఫిల్స్ క్యాంప్ వైపు దూసుకొచ్చారు. భద్రతా క్యాంప్‌పై ఒక్కసారిగా రాళ్ల వర్షం కురిపించారు. ఆందోళనకారులు పెద్ద ఎత్తున అల్లర్లకు, దహనకాండకు పాల్పడ్డారు. పరిస్థితిని అదుపు చేయడానికి సేనాపతి పోలీసులు రంగంలోకి దిగారు.
సీ ఆర్‌పీఎఫ్ బలగాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. అల్లరి మూకలను చెదరగొట్టడానికి బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. టి యర్ గ్యాస్ గ్రెనేడ్లను ప్రయోగించాల్సి వచ్చింది. వెనక్కి తగ్గుతున్న క్రమంలో అల్లరి మూకలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. అ స్సాం రైఫిల్స్ వాహనాలను ధ్వంసం చేశా యి. ఒక చిన్న సైనిక వాహనానికి నిప్పంటించాయి. రెండు భారీ ట్రక్కులను రోడ్డుపైకి తలకిందులుగా పడదోశాయి. ఒక పౌర కారు కూడా ఈ హింసలో కాలిబూడిదైంది.
నాగా తాఫౌ ప్రాంతంలో ఉన్న ఒక ప్రయాణికుల వెయిటింగ్ షెడ్డును తగులబెట్టారు. భద్రతా బలగాల ఉమ్మడి ప్రయత్నాలతో అర్ధరాత్రి సమయానికి పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం సేనాపతి జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.






