3 May, 2026 | 1:29 AM

ఈ వారం వార్తల్లో..

03-05-2026 12:02 AM

తస్‘వీర్ రాయ్’

‘చిత్రం.. భళారే విచిత్రం !’ అనేది ఓ తెలుగు నానుడి. రఘురాయ్ తీసిన ఏ ఫోటోనైనా చూసిన వారి నోటి నుంచి వచ్చే మొదటి పదాలు అవే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆయన ఫొటోల్లో మనుషులు కాదు.. వారి వ్యక్తిత్వాలు ఉంటాయి. ప్రకృతి కాదు.. ఎన్నో భాష్యాలుంటాయి. ఏడు దశాబ్దాల పాటు ఎన్నో విపత్తులకు, రాజకీయ పరిణామాలకు ఆయన ఫొటోలే సజీవ సాక్ష్యం. ఈయన ఇటీవల పరమపదించాడు.

చలే గయా బాల్‌కిషన్

తెలంగాణ సంస్కృతిని, మాండలికాన్ని ఒడిసి పట్టి తన రచనల్లో ప్రతిఫలించిన అరుదైన రచయిత తెలిదేవర భానుమూర్తి. మన యాసలోని తియ్యందనాన్ని నలుదిశలా పంచినవాడు. అచ్చమైన తెలంగాణవాది ఆయన. ౧౯౬౯ ఉద్యమంలో అరెస్టు జైలుకెళ్లినవాడు. పాత్రికేయుడిగా ‘చల్నేదో బాల్‌కిషన్’ కాలమ్‌తో పాఠకుల హృదయాలు కొల్లగొట్టినవాడు. ఇటీవల ఆయన శాశ్వతంగా కన్ను/పెన్ను మూశాడు.