24 April, 2026 | 4:16 PM

బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి

24-04-2026 02:40 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కొడలు ప్రీతిరెడ్డి(Preeti Reddy) బీజేపీలో చేరుతున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ప్రీతిరెడ్డి శుక్రవారం నాడు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. దీంతో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారనే కథనాలు మీడియాలో వెలువడ్డాయి. ఈ పుకార్లపై ప్రీతి రెడ్డి స్పందిస్తూ చెక్ పెట్టారు.

తాను బీజేపీలో చేరడం లేదని, అన్ని పార్టీల నేతలను కలుస్తున్నానని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీని(Prime Minister Narendra Modi) తమ యూనివర్సిటీలోని ఏఐ క్యాంపస్ ఓపెనింగ్‌కు(AI Campus Opening) పిలిచినట్లు వివరించారు. ప్రధాని మోదీని ఆహ్వానించాం కాబట్టే బీజేపీ నేతలను కలుస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల మంత్రి శ్రీధర్ బాబుని కూడా కలిసినట్లు చెప్పారు. మల్లారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, తమకు బీఆర్ఎస్ పార్టీ మీద గౌరవం ఉందని మల్లారెడ్డి కొడలు ప్రీతి రెడ్డి స్పష్టం చేశారు.