అక్రమంగా గంజాయి రవాణా.. ఇద్దరి అరెస్ట్
17-06-2026 12:00 AM
బూర్గంపాడు,జూన్16,(విజయక్రాంతి): అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను బూర్గంపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మండల పరిధిలోని సారపాక పల్లె పకృతి వనం వద్ద ఎస్‌ఐ మేడ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
అదే సమయంలో ఒడిస్సా నుండి ములుగు జిల్లా మంగపేటకు అక్రమంగా బజాజ్ పల్సర్ బైక్ వస్తున్న ఇద్దరు వ్యక్తులను అనుమానంతో ఆపి, వారి వాహనాన్ని తనిఖీ చేయగా.. రూ.1.05లక్షల విలువ చేసే 2.1కిలోల గంజాయి పట్టుబడినట్లు పోలీసులు చెప్పారు. నిందితులు ములుగు జిల్లాలోని మంగపేటకు చెందిన బడే భరత్,ఉప్పరపల్లి వెంకటేష్ గా గుర్తించినట్లు చెప్పారు. నిందితులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.






