17 June, 2026 | 3:27 AM

హాజ్ యాత్ర అనంతరం మాజీ మంత్రి మల్లారెడ్డిని కలిసిన యూనిస్ పాషా

17-06-2026 02:13 AM

మేడ్చల్ అర్బన్ జూన్ 16 (విజయక్రాంతి): హజ్ యాత్రను విజయవంతంగా ము గించుకున్న సందర్భంగా మేడ్చల్ బిఆర్‌ఎస్ పార్టి ఎమ్మెల్యే మాజి మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డిని, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిలను మాజి మండల కోఆప్షన్ సభ్యులు రుక్సనా యూనిస్ పాషా మర్యాద పూర్వకంగా కలువదండం జరిగిందని చెప్పారు.

ఈ నేపథ్యంలో హాజ్ యాత్రను విజయవంతంగా ముగించుకొని సురక్షితంగా గమ్యానికి చేరుకున్న యూనిస్ పాషాకు మాజి మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డి,మర్రి రాజశేఖరరెడ్డి లు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎల్లంపేట్ మున్సిపల్ కౌన్సిలర్ లు సద్ది సురేష్ రెడ్డి.చిన్నోళ్ల భాస్కర్.లతో పాటు రాజేందర్ నాయక్.శ్రీను నాయక్. అధినవ్ రెడ్డి.తదితరులు పాల్గొన్నారు...