ఫార్చ్యూన్ ఎలిగేన్స్ అపార్ట్‌మెంట్‌పై అక్రమ నిర్మాణం
మున్సిపల్ అధికారుల నోటీసులను లెక్కచేయని బిల్డర్
రాజేంద్రనగర్, జూన్ 25 (విజయక్రాంతి): బండ్లగూడ జాగీర్ 121 డివిజన్ పద్మశ్రీ కాలనీలోనీ ఫార్చ్యూన్ ఎలిగేన్స్ అపార్ట్మెంట్, పై అక్రమ నిర్మాణం కొనసాగుతుంది. ఈ అపార్ట్‌మెంట్‌కు ఐదు అంతస్తుల నిర్మాణం వరకే బిల్డర్ అనుమతులు తీసుకున్నప్పటికీ ప్లాట్ నెంబర్ 101 పై భాగంలో ఆరవ అంతస్తు నిర్మించేందుకు బిల్డర్ మాధవరావు పిల్లర్లు వేయడానికి బాక్సులు సిద్ధం చేశాడు.
ఇది ఇలా ఉంటేగతంలో పద్మశ్రీ హిల్స్ ప్రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అక్రమ నిర్మాణంపై బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది అప్పట్లో మున్సిపల్ అధికారులు బిల్డర్‌కు నోటీసులు ఇవ్వడంతో నిర్మాణం ఆగినప్పటికీ ఇటీవల మళ్ళీ భవనంపై 6 వ అంతస్తు నిర్మిస్తున్నారని బిల్డర్ స్వప్రయోజనాల కోసం పరిమితికి మించి అనుమతి లేని నిర్మాణాలు చేపడుతున్నారని వెంటనే జిహెచ్‌ఎంసి రాజేంద్రనగర్ సర్కిల్ అధికారులు చర్యలు తీసుకోవాలనీ పద్మశ్రీ హిల్స్ కాలనీ ప్రజలు కోరుతున్నారు.
అధికారులు అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలి: వేణుగోపాల్
పద్మశ్రీ హిల్స్ కాలనీలో అనుమతులు ఉన్న దానికంటే అదనంగా 6వ అంతస్తు నిర్మిస్తున్న బిల్డర్ పై చర్యలు తీసుకుని అక్రమ నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలని ఆ కాలనీకి చెందిన వేణుగోపాల్ జిహెచ్‌ఎంసి రాజేంద్రనగర్ సర్కిల్ టౌన్ ప్లాన్ అధికారులను కోరారు. దీనివల్ల కాలనీలోని ప్రజలకు మంచినీరు సరిపోకపోవడం, డ్రైనేజీ సమస్య, రోడ్లమీద వాహనాల నిలుపుదల వంటి సమస్యలు ఎదురవుతాయనీ ఆయన అధికారులను కోరారు.






