6 July, 2026 | 2:16 AM

బస్టాండ్ అంతా కంపు.. కంపు..

06-07-2026 12:05 AM

మహబూబ్ నగర్ అర్బన్, జూలై 5: బస్టాండ్ అంతా కంపు కంపు కొడుతుందని సిపిఎం జిల్లా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సిపిఎం జిల్లా కమిటీ ఆదివారం రోజు సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బస్టాండ్ లో సిపిఎం బృందం సందర్శించి బస్టాండ్ లో నెలకొన్న పలు సమస్యలను తెలుసుకున్నారు.

నూతనంగా నిర్మించిన కాంప్లెక్స్ క్రింద త్రాగుబోతులకు అడ్డాగా మారిందని, వ్యభిచారానికి నిలయంగా ఉందని, బస్టాండ్ ఆవరణ అంతా అపరిశుభ్రత దుర్వాసన దుర్గంధంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రధాన ఎంట్రెన్స్ మార్గంలో మరుగుదొడ్ల నుండి నుండి బాత్రూంలో నుండి కలుసీత నీళ్లు బయటకు వచ్చి దుర్వాసన వెదజల్లుతున్నదని, ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్లడానికి ఆటోలు నీళ్లు నిలవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని, బస్టాండ్ లో ప్రయాణికులు కొద్దిసేపు నిలిచి ఉండడానికి కూడా దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారని. బస్టాండ్ మొత్తం గుంతల మయంగా మారిందని, ప్రయాణికులు జగ్జీవన్నగర్ గోడవైపు, అంబేద్కర్ నగర్ వైపు బహిరంగ మూత్ర విసర్జన వల్ల విపరీతమైన దుర్గంధం వాసనతో చుట్టుముట్టు కాలనీవాసులు ఇబ్బందులకు గురవుతున్నారని, శిథిలావస్థలో ఉన్న మూత్రశాలలు కూల్చివేయాలని, బహిరంగ మూత్ర విసర్జన ,మలవిసర్జన వల్ల చుట్టుముట్టు ప్రజలు ప్రయాణికులు దుర్గంధంతో ఇబ్బందులకు గురవుతున్నారని. బస్టాండ్ కు వచ్చే ప్రయాణికులు రోగాల బారిన పడే రకంగా బస్టాండ్ లో వాతావరణం కలదని ,బస్టాం డ్ లోని మూత్రశాలలు మరుగుదొడ్లు క్లీనింగ్ లేక మూత్ర విసర్జన మలమూత్రాలు చేయలేక ప్రయాణికులు ముక్కు మూసుకొని బయటికి వస్తున్నారని, ప్రయాణికులు సిపిఎం నాయకులకు తెలిపారు.

బస్టాండ్ వాతావరణం అంతా దుర్గంధం వెదజల్లుతున్నదని, బస్టాండ్ లోని క్యాంటీన్ నుండి వెలువడే మురికి నీరు బస్టాండ్ లోనే నిల్వ ఉంటుందని, మురికి కాలువలు నిండిపోయి నీళ్లు పోవడానికి లేకుండా బయటకి ఉబ్బి వస్తున్నాయని వర్షపు నీళ్లు మురికి నీళ్లు కలిసి దుర్గందానికి మూలంగా ఉన్నాయని,  గుంతల మయమైన  బస్టాండు ప్రమాదాలకు నిలయంగా మారిందని ,బస్టాండ్ ముందు వందల ఆటోల నిలవడం వల్ల ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడుతుందని, రేవా హోటల్ ముందు ఆటోల నిలుపుల నిలపడం వల్ల తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడి బస్సులు రాకపోకల కూడా ఇబ్బందిగా మారిందని ప్రయాణికులు చుట్టుము ట్టు వ్యాపారులు వాపోయారని, ఆర్టీసీ యా జమాన్యం, ట్రాఫిక్ పోలీసులు, రెవెన్యూ డిపార్ట్మెంట్, సివిల్ పోలీసులు బస్టాండ్ ను సందర్శించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నల్లవెల్లి కురుమూర్తి, సీనియర్ నా యకులు కమరలి, వరదగాలన్న, రాజ్ ఖయ్యూం తదితరులు పరిశీలించారు.