అసత్యాలు ఆపకుంటే ఖబడ్దార్
- కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు నా తప్పులను నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా
- నాదర్‌గుల్ భూములపై కర్త, కర్మ, క్రియ బీఆర్‌ఎస్ ప్రభుత్వమే
- గజ్జికుక్కల్లాగే బీఆర్‌ఎస్ వ్యవహారం
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): శకుని మామ కేసీఆర్ డైరెక్షన్‌లో అబద్ధాల హరీశ్‌రావు, డ్రామారావు కేటీఆర్ తమ ప్రభుత్వం, మంత్రులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఆరోపణలు ఆపకుంటే ఖబడ్దార్ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. గత పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని కొల్లగొట్టి, ఒంటి నిండా అవినీతి బురద పూసుకున్న అబద్ధాలరావు, డ్రామారావు, శకుని మామలు ఇప్పుడు ఆ బురదను ప్రజా ప్రభుత్వానికి అంటించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎంపీలు అనిల్‌కుమార్ యాదవ్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, సామెల్, బీ లక్ష్మారెడ్డి, శ్రీగణేష్, రాంమోహన్‌రెడ్డి తదితరులతో కలిసి మాట్లాడారు. నాదర్‌గుల్, వట్టినాగులపల్లి, కొత్వాల్‌గూడ అంశాలపై మంత్రి ఆధారాలతో సహా ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పి కొట్టారు. నాదర్‌గుల్ భూముల విషయంలో హరీశ్‌రావు చెప్తున్నవన్నీ అబద్ధా లేనని కొట్టిపారేశారు.
సర్వే నంబర్ 613లోని భూములను 2014లోనే మూడు సంస్థలకు బీఆర్‌ఎస్ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసిందని, నాదర్‌గుల్ భూముల అంశంలో కర్త, కర్మ, క్రియ అంతా బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. నాటి రిజస్ట్రేషన్‌లతో తమ ప్రభుత్వానికి ఏం సంబంధమని ప్ర శ్నించారు. ఈ భూముల్లో 2022లోనే నిర్మాణాలు ప్రారంభమయ్యాయని, నాలా కన్వ ర్షన్ విషయంలో సదరు సంస్థలు కోర్టుకు వెళ్తే నాటి ప్రభుత్వం కౌంటర్ కూడా దాఖలు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
గతంలో వాటాల ఒప్పందం చేసుకుని, భూములు కట్టబెట్టి వాటాలు దక్కలేదని ఇప్పుడు తమపై నిందలు వేయడం సిగ్గుచేటని విమర్శించారు. నిషేధిత భూముల్లో నా కుటుం బసభ్యులెవరూ లేరని, నా కుటుంబసభ్యులు ఉన్నారని నిరూపించాలని సవాల్ చేశారు. వట్టినాగులపల్లి భూముల్లోనూ హరీశ్‌రావు పూర్తిగా దుష్ప్రచారం చేస్తున్నారని, కుటుంబసభ్యుల వివాదాన్ని కూడా ఈ ప్రభుత్వానికి అంటగట్టారని తెలిపారు.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2023 వరకు వారి పాలనలో అబద్ధాలరావు, డ్రామారావు, శకుని మామ ముగ్గురూ ఎన్ని సెక్టార్లలో దోచుకున్నారో ప్రతిదీ సీబీసీఐడీ ద్వారా దర్యాప్తులో బయటకు వస్తుందన్నారు. వట్టినాగులపల్లి అంశం లో చేసిందెవరో, దాని వెనుక ఎవరి పాత్ర ఉందో, ఏ హోమ్ పాత్ర ఉందో, ఆ హోమ్ కు వత్తాసు పలికేదెవరో విచారణలో తేలుతుందన్నారు.
వారి అక్రమ ఆస్తులను కాపా డుకోవడానికి భయబ్రాంతులను గురిచేస్తే ప్రభుత్వం భయపడదని స్పష్టంచేశారు. వారి అక్రమాల చిట్టా, వారి భూదందాల చిట్టా, వారు అధికారంలో ఉన్నప్పుడు చేసినవన్నీ బయటకు తీసేది త్వరలోనే ఉంటుందని హెచ్చరించారు.




