రోడ్డుపై నిర్మిస్తున్న ఇంటిని తొలగించిన హైడ్రా
సికింద్రాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): సికింద్రాబాద్ బోయిగూడ లోరహదారికి అడ్డంగా నిర్మిస్తున్న ఇంటిని హైడ్రా తొలగించింది. న్యూ బోయిగూడ టింబర్ డిపో ప్రాంతంలో రహదారి మీద అక్రమంగా సిమెంట్ రోడ్డు వేసి రాకపోకలు సాగిస్తున్నా పట్టించుకోకుండా 20 అడుగుల రహదారిని 10 అడుగుల మేర 50 గజాల వరకూ ఆక్రమించేసి కిందన షాపుపైన నివాసం ఉండే లా ఇంటి నిర్మాణాన్ని చేపట్టడంపై స్థానికులు హైడ్రా అధికారులకుఫిర్యాదు చేశారు.
ఇతను గతంలోచిన్న డబ్బా పెట్టుకుని వ్యాపారం చేసుకుంటే, తాము ఏదో జీవనోపాధి పొందుతున్నాడని వదిలేస్తే, ఇప్పుడు దారిని ఆక్రమించి ఏకంగా ఇంటిని నిర్మిస్తున్నారని.ఈ విషయాన్ని హైడ్రా, జీహెచ్ ఎంసీకి కూడా ఫిర్యాదు చేశామని స్థానికులు పిర్యాదులో పేర్కొన్నారు.20 అడుగుల రహదారి 10 అడుగుల మేర ఆక్రమణకు గురి కావడంతో వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇంటికి ఎలాంటి నిర్మాణ అనుమతులు లేకుండా నిర్మిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో బుధ వారం నిర్మాణ దశలో ఉన్న ఇంటిని తొలగించి, దీంతో యధావిధిగా రహదారి రాకపోక సాగిస్తున్నారు. హైడ్రా చర్యలుతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.




