తప్పుతై తప్పకుండా ప్రశ్నిస్తాం!
- ఆ అధికారం, హక్కు సభ్యుడిగా నాకుంది
- అవసరమైతే సుప్రీం కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తాం
- అసెంబ్లీలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో స్పీకర్ తీర్పుపై అభ్యంతరం
హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): స్పీకర్ అంటే తమకు గౌరవం ఉన్నదని కానీ తీసుకున్న నిర్ణయం తప్పుతై తప్పకుండా ప్రశ్నించే అధికారం, హక్కు సభ్యుడిగా తనకు ఉన్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘స్పీకర్‌పై నాకు మర్యాద ఉంది. కానీ మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఎంపీగా పోటీ చేస్తే మీరు ఓ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై అవసరమైతే రివ్యూ పిటిషన్లు వేస్తాం. ఇది న్యాయవ్యవస్థలో ప్రాసెస్’ అని కేటీఆర్ అన్నారు.
జడ్జిమెంట్ చదివారా?: స్పీకర్ ప్రసాద్
కేటీఆర్ వ్యాఖ్యలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. ‘జ్యుడిషియరీ వ్యవస్థలో జడ్జి తీర్పు ఇస్తారు. కానీ మీ రు జడ్జిమెంట్ చదవకుండానే నాపై ఎన్ని అభియోగాలు మో పారు. అయినా నేను మీడియా ముందుకు రాలేదు. ఈ విషయంలో కూడా జడ్జిమెంట్ చదివాక మాట్లాడితే మీకు జవాబిస్తాను. దయచేసి విషయంలో ప్రశ్నించడాన్ని తగ్గించుకుంటే మంచిది’ అని సూచించారు.
నిరంకుశత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు: మంత్రి పొంగులేటి
నిరంకుశత్వానికి బీఆర్‌ఎస్ నాయకులే బ్రాండ్ అంబాసిడర్లని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. స్పీకర్‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ కట్టుకథలు అల్లుతున్న ప్రతిపక్ష నేత చివరకు జడ్జి స్థానంలో స్పీకర్‌ను కూడా ప్రశ్నించే స్థాయికి మాట్లాడుతుంటే వారు ఏ రకమైన అహంకారంతో ఉన్నారో అర్థం చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయకపోతే వాటికి కారణాలపై విశ్లేషించుకోకుండా కట్టుకథలు, మాటల గారడీలు చేస్తున్నారని దుయ్యబట్టారు.




