18 March, 2026 | 5:03 PM

మేం వ్యతిరేకం కాదు.. మూసీ ప్రక్షాళన ప్రారంభమయ్యిందే బీఆర్ఎస్ హయాంలో

18-03-2026 11:34 AM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాలు మూడోరోజు కొనసాగుతున్నాయి. సభలో మూసీ నది ప్రాజెక్టుపై(Musi River Project) ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. మూసీ నది ప్రక్షాళన ప్రారంభమయ్యిందే కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అని బీఆర్ఎస్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి(BRS LB Nagar MLA Sudheer Reddy) స్పష్టం చేశారు.

మూసీ నదిలో మూడు స్థాయిలున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) హైడ్రా పేరుతో పేద ప్రజలమీద పడి, వాళ్ల ఇళ్లకు రెడ్ మార్కులు పెట్టినిద్రాహారాలు లేకుండా చేసిందని మండిపడ్డారు. మూసీ పునర్మిర్మాణానికి బీఆర్ఎస్ హయాంలో ఒక్క నిర్మాణం కూలగొట్టలేదని వివరించారు. మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మూసీ అభివృద్ధికి తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి తేల్చిచెప్పారు.