స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం
బెజ్జూర్,(విజయక్రాంతి): బస్టాండ్ నిర్మాణం కోసం స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తామని ఆర్ ఎం విజయ భాను తెలిపారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం లోని కాగజ్ నగర్, కౌటాల, పెంచికలపేట, బెజ్జూర్ మండలాలలోని మారుమూల గ్రామాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసిఫాబాద్ డిపో ఆర్టీసీ బస్సులలో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.
పెంచికల్పేట్ నుండి సలుగు పల్లి వరకు రోడ్డు గుంతల మయంగా ఉండడంతో ఆర్టీసీ బస్సులు సైతం చెడిపోతున్నాయి. ప్రయాణికులు సైతం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బెజ్జూర్ మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం కోసం గ్రామ సర్పంచ్ పాలకవర్గం స్థలం కేటాయించి తీర్మానం చేసి ఆర్టీసీ ఆసిఫాబాద్ డిపో మేనేజర్ రాజశేఖర్ కు సమాచారం అందిస్తే వచ్చి స్థలాన్ని పరిశీలించి బస్టాండ్ నిర్మాణం కోసం నివేదిక పంపిస్తారని తెలిపారు. వారి వెంట ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు.






