17 April, 2026 | 9:34 PM

Breaking News

జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •   సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన   •  

మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు

17-04-2026 08:11 PM

వేములవాడ,(విజయక్రాంతి): మండుతున్న ఎండల నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు వేములవాడ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పుల్కం రాజు మాట్లాడుతూ, వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటి సౌకర్యం అందించాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మున్సిపల్ కార్యాలయానికి వచ్చే ప్రజలు, పాదచారులు, పట్టణ వాసులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. వేసవి కాలంలో తాగునీటి కొరత తలెత్తకుండా మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.