17 April, 2026 | 10:05 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది

17-04-2026 08:19 PM

రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి

కామారెడ్డి,(విజయక్రాంతి): ఆర్టీసీలో ఈనెల 22 నుండి చేపట్టబోయే నిరవధిక సమ్మెలో భాగంగా సమ్మె సన్నాహక సభలలో పాల్గొనడానికి శుక్రవారం సాయంత్రం 6గంటలకు కామారెడ్డి డిపో ముందు ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె కరపత్రాలను ఆవిష్కరించి గేటు ముందు నిరసన దర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి మాట్లాడుతూ... రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన జీతభత్యాలు, రెండు పిఆర్సిలు, యూనియన్ల పునరుద్ధరణ తదితర అంశాలను మాత్రం అమలుపరచకుండా 18 వేల ఖాళీలను పూర్తి చేయకుండా ఉన్న సిబ్బందితోనే తీవ్రమైనటువంటి మోటార్ ట్రాన్స్పోర్ట్ వకర్స్ యాక్ట్ 1961 తుంగలో తొక్కి పని గంటలను పెంచి కార్మికులను శారీరకంగా, మానసికంగా వేడిస్తూ శ్రమాదోపిడికి ఆర్టీసీ యాజమాన్యం పాల్పడుతున్నారని 

 అన్నారు. ఎలక్ట్రిక్ బస్సులతో డిపోలకు డిపోలు ప్రైవేటుపరం చేస్తూ పర్మనెంట్ ఉద్యోగాలు లేకుండా సంస్థను నిర్వీర్యం చేస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులను ఇవ్వాలని ఆర్టీసీకి సబ్సిడీ ఇచ్చి నడిపి ఇవ్వాలని అన్నారు.తద్వారా ఆర్టీసీ రెగ్యులర్ ఉద్యోగులు బస్సుకు 6 గురి నియామకకాలు చేపట్టడం సంస్థ ప్రైవేట్ కాకుండా నిలబడుతుందని పేర్కొన్నారు.

పెండింగ్గు లో ఉన్న రెండు పీఆర్సీలను(2021,2025) వెంటనే అమలు చేయాలని 2017 పి ఆర్ సి బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేసారు.మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీకి చెల్లించాల్సిన సుమారు 2700 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని మహాలక్ష్మి పథకాన్ని కార్మికులు తమ భుజస్కందాలపై వేసుకొని విజయవంతం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కృతజ్ఞత కూడా చూపడం లేదని అన్నారు.

వివిధ రకాల సబ్సిడీ పాసులకు చెల్లించాల్సినటువంటి డబ్బులను కూడా బడ్జెట్లో కేటాయించలేదని ఆ డబ్బులను వెంటనే జమ చేయాలని అన్నారు. రిటైర్ ఐన ఆర్టీసీ కార్మికులకి 2017 పి ఆర్ సి బకాయిలు చెల్లించకపోవడంతో వారి కుటుంబాలు అర్దాకలితో జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల పరిస్థితి పెనం నుండి పొయ్యిలో పడిందని సమ్మె తప్ప వేరే మార్గం కనిపించడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయాలని కోరారు.ఒకవేళ సమ్మె జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.