ప్రతి ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక సాయం అందిస్తా..
కౌన్సిలర్ మద్యపాగు మహేష్
మొయినాబాద్ జూన్ 24(విజయ క్రాంతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఆడబిడ్డ విహాహనికి ఆర్ధిక సాయం చేస్తానని కౌన్సిలర్ మద్యపాగు మహేష్ అన్నారు. బుధవారం మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డుకు చెందిన న్యాలాటి బాలయ్య ఇందిరమ్మ దంపతుల కుమార్తె మమత వివాహానికి హాజరైన కౌన్సిలర్ మద్యపాగు మహేష్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. అదే గ్రామానికి చెందిన కనగళ్ల విజయ్ కుమార్ పద్మావతి దంపతులకు చెందిన కుమార్తె కస్తూరీ వివాహానికి హాజరై ఆశీర్వదించారు. అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆడబిడ్డ కళ్యాణ కానుక పథకం ద్వారా తన వంతు బాధ్యతగా రూ.25 వేల రెండు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ మద్యపాగు మహేష్ మాట్లాడుతూ.. ఆడబిడ్డ కళ్యాణ కానుక పథకం ద్వారా వార్డులోని అర్హులైన ప్రతి ఆడబిడ్డ పెళ్లికి పెద్దన్నగా వారికి అండగా ఉంటూ ఆర్థిక సాయం చేస్తానన్నారు. ఆడ బిడ్డల వివాహానికి ఆర్థిక సాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. వార్డులో మౌలిక వసతులు కల్పించి వార్డును మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. వార్డు అభివృద్ధికి కౌన్సిలర్ మద్యపాగు మహేష్ చేస్తున్న కృషికి వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.






