హైదరాబాద్ అన్ని రంగాల్లో వృద్ధి
మంత్రి దామోదర్ రాజనర్సింహ
సంగారెడ్డి, మే 5 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్ వరల్డ్స్ మొదటి ఫార్మాట్, ఇండియాస్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ నిర్వహణపై రూపొందించిన వాల్ పోస్టర్‌ను మంత్రి దామోదర్ రాజనర్శింహ సంగారెడ్డిలోని తన నివాసంలో మంగళవారం ఆవిష్క రించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభి వృద్ధి చేస్తున్నామన్నారు. ఫార్మా, ఐటీ హబ్‌గా హైదరాబాద్‌కు ప్రపంచ వ్యాప్త గుర్తింపునకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు.
హైదరాబాద్ లో మెడికల్ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి హైదరాబాద్ వేదిక కావడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదన్నారు. దేశంలోని సినిమా, ఓటీటీ, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రభావితం చేసే ముఖ్యమైన వ్యక్తులం దరూ హైదరాబాద్‌లో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనే విధంగా ఈ కార్యక్రమా న్ని రూపొందించిన నిర్వాహకులను అభినందిం చారు.
ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో 43 దేశాల నుంచి ప్రతినిధులు, 8 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు, ఫిల్మ్ మేకర్స్ పాల్గొంటారని నిర్వాహకులు మంత్రికి వివరించారు. దేశంలో సినిమా, ఓటిటీ, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఇన్లుయెన్సర్లు అందరు ఒక్క వేదిక పైకి రావడం ఇదే మొదటిసారని తెలిపారు.






