7 July, 2026 | 12:50 AM

గుట్ట మాయం.. అధికారుల సాయం..?

07-07-2026 12:00 AM
  1. మోతె మండలం ఉర్లుగొండ గ్రామ పరిధిలో గంగదేవిగుట్టపై ఆక్రమణదారుల కన్ను
  2. గత సంవత్సరం నుండి ఆక్రమణ పనులు ప్రారంభం                 
  3. విజయక్రాంతి కథనాలతో కొన్నాళ్ళు నిలిచిన పనులు
  4. గత శనివారం నుండి స్వాహా కార్యం పనులు పునఃప్రారంభం
  5. అధికారుల తీరుపై వెల్లువెత్తుతున్న అనుమానాలు!
  6. కబ్జాకోరుల నుండి గుట్టను కాపాడాలని స్థానికుల వేడుకోలు 

మోతె, జూలై 6: మండలంలోని ఉర్లుగొండ రెవిన్యూ పరిధిలో గల తుమ్మగూడెం గ్రామ శివారులోని గంగదేవిగుట్ట ఆక్రమణదారుల ఉచ్చులో చిక్కుకొని సంవత్సరానికి కొంత మాయమైతుంది. వాస్తవికంగా ఉర్లుగొండ రెవిన్యూ గ్రామ పరిధిలోని 331 సర్వే నెంబర్ లో 36.10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గంగదేవి గుట్ట గతంలోనే 10 ఎకరాల మేర ఆక్రమణకు గురికాగా 26 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అయితే కొందరు కబ్జాదారుల చూపు ఆ గుట్టపై పడడంతో స్వాహాకార్యం ప్రారంభమైనట్లు చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు చెబుతున్నారు. దీనికి లంచాల మ త్తులో తూగుతున్న కొందరు అధికారుల సా యం సైతం అందుతుందనే వార్తలు స్థానికంగా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి

గత సంవత్సరం నుండి గుట్టపై కన్ను

రోజురోజుకు భూమి రేటు పెరుగుతుండడంతో కొందరు కబ్జాకోరుల కన్ను ఎక్కడ ఖాళీ స్థలాలు, గుట్టలు ఉన్నాయో అక్కడ గద్దల వాలిపోయి వాటిని తమ కబందహస్తాల్లో బంధించేస్తున్నారు. దీనిలో భాగంగా గంగదేవిగుట్టపై సైతం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం హైదర్ సాయిపే టకు చెందిన ఓ వ్యక్తి కన్ను పడింది. ఇంకేముంది ఇదే తడువుగా మకాంలో ఇక్కడికి మార్చేసి ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నాడు.

గత సంవత్సర కాలం నుండి అనుమతులు లేకుండా పెద్దపెద్ద బ్లాస్టింగ్ చేస్తూ.. డోజర్ లతో గుట్టను చదును చేసి సాగుకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అలాగే కొందరు స్థానికులతో మంచి సాన్నిహిత్యా న్ని ఏర్పాటు చేసుకొని వారి సహకారంతో ఎలాగైనా గుట్ట భూమిని తనది చేసుకొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీ య సమాచారం. 

అధికారుల తీరుపై అనుమానాలెన్నో?

గంగదేవిగుట్ట ఆక్రమణపై గతంలో విజయక్రాంతి పత్రిక రాసిన కథనాలపై స్పందించిన రెవెన్యూ అధికారులు దానిని పూర్తిస్థాయిలో పరిశీలన చేశారు. తదుపరి అదే గుట్టలో సుమారు ఎకరం భూమిని వివోఏ బిల్డింగ్ నిర్మాణానికి, ఫుడ్ గ్రీన్ గోదాం నిర్మాణానికి కేటాయిస్తున్నట్లు తుమ్మగూడెం గ్రామపంచాయతీకి పంచనామా రిపోర్టును అందజేసి చేతులు దులుపుకున్నట్టు తెలిసింది. అయితే అక్రమంగా ఆక్రమించే ప్రయత్నం చేసిన వ్యక్తిపై మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోగా.. అతనిపై కనీసం ఫిర్యా దు కూడా చేయలేదంటూ అధికారుల తీరు పై స్థానికులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

స్వాహాకార్యం పునః ప్రారంభం: 

పత్రికల్లో వచ్చిన కథనాలను చూసిన అధికారులు పరిశీలించి కొంతకాలం ఆగిన తదుపరి తిరిగి గత శనివారం రోజున గుట్టుచప్పుడు కాకుండా గుట్టను చదును చేసి దా నిని ట్రాక్టర్ సాయంతో దున్నినట్లు స్థానికు లు చెబుతున్నారు. ఇంత జరిగినా అధికారు లు అటువైపు కూడా చూడడం లేదని, దీం తో వారి తీరుపై అనుమానాలు మరింత బ లపడుతున్నాయనే వార్తలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా గంగదేవిగుట్టను కబ్జాకోరుల చేతికి పోకుండా రెవిన్యూ అధికారులు అడ్డుకొని ఆ ప్రభుత్వ భూమిని కా పాడాలని స్థానికులు కోరుతున్నారు.

నా దృష్టికి వచ్చింది

గంగదేవిగుట్టను చదును చేసి దున్నుతున్నారు అనే విషయం నా దృష్టికి వచ్చింది. వెంట నే ఆర్‌ఐ, ఆ గ్రా మ జిపిఓలకు సమాచారం అందించి.. ఈ విషయమును ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవోలకు తెలియ పరచాలని ఆదేశించా. అలాగే ఆ భూమిని రక్షించేందుకు తగు చర్యలు తీసుకోవాలనీ సూచించా. 

వెంకన్న, తాసిల్దార్, మోతె