6 May, 2026 | 3:54 AM

ఏరియా పర్సనల్ మేనేజర్‌గా పదవి బాధ్యతలు స్వీకరించిన తిరుపతి

06-05-2026 02:21 AM

మర్యాదపూర్వకంగా కలిసిన కొత్తగూడెం ఐఎన్టీయూసీ నాయకులు

కొత్తగూడెం, మే 5 (విజయక్రాంతి): కొత్తగూడెం ఏరియా జిఎం ఆఫీస్ నందు పర్సనల్ మేనేజర్ గా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన ,ఎల్.తిరుపతి నీ మంగళవారం ఐఎన్టీయూసీ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్, ఎండి రజాక్ ఆధ్వర్యంలో ఐఎన్టియూసి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.

అనంతరం రజాక్ మాట్లాడుతూ, కార్మికులకు రావలసిన ప్రమోషన్స్ ,ఇంక్రిమెంట్స్ సకాలంలో, ఇచ్చే విధంగా చూడాలని  కార్మికుల సంక్షేమం సమస్యల పరిష్కారం సంస్థ అభివృద్ధికి పరస్పర సహకారం అందే  విధంగా చూడాలని, యాజమాన్యం , కార్మికులతో సత్సంబంధాలు కొనసాగించాలని ఆకాంక్షించారు.

ఎల్.తిరుపతి పర్సనల్ మేనేజర్ తమ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తారని కార్మికులకు న్యాయం చేసేలా, సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివైపియం హరీష్, సెంట్రల్ కమిటీ మెంబర్స్ మెంగని.అశోక్, పోశం శ్రీనివాస్, ఎం. కొమరయ్య, ట్రెజరర్ భీముడు, సీనియర్ నాయకులు జిదుల రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.