నిరుద్యోగులకు అన్యాయం చేసేలా పోలీసు నోటిఫికేషన్
-పోలీసు పోస్టుల సంఖ్య పెంచాలి
-ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష నీళ్లు, నిధులు,నియామకాలు
హుజూర్ నగర్, జూలై 6 : నీళ్లు,నిధులు,నియమకాలు అనే నినాదంతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు అన్యాయం చేసేలా ప్రస్తుతం ప్రభుత్వం పోలీసు నోటిఫికేషన్ విడుదల చేసిందని వీటిని కనీసం 20 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి పెంచాలని బీఆర్‌ఎస్వి రాష్ట్ర నాయకులు జనిగ సందీప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు... ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష నీళ్లు, నిధులు,నియామకాలు అని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా నిరుద్యోగులను విస్మరించిందని ఆరోపించారు.
రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే, ప్రభుత్వం అతి తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న 5 వేల నుంచి 7 వేల పోస్టులతో భర్తీ ప్రక్రియ చేపడితే నిరుద్యోగులకు ఏమాత్రం ప్రయోజనం ఉండదని మండిపడ్డారు. టీజీఎల్పీఆర్బీ ద్వారా 20 వేల కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్వీ నాయకులు కొండ సాయి చరణ్, నరసింహ, వినయ్, వెంకటేశ్వర్లు, వెంకన్న,తదితరులు,పాల్గొన్నారు.






