12న డీవీటీఎన్ సంస్మరణ సభ విజయవంతం చేయాలి
చివ్వెంల, జూలై 6: భారత కమ్యూనిస్టు విప్లవ ఉద్యమ ప్రముఖులు కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు (డీవీ), కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి (టీఎన్) సంస్మరణ సభను జూలై 12న చివ్వెంల మండలం చందుపట్ల శివారులోని అక్కలదేవిగూడెంలో నిర్వహిస్తున్నట్లు గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి కొనకంచి వీరభద్రయ్య తెలిపారు.
చందుపట్లలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డీవీటీఎన్ ఆశయాలు, ప్రజలకు వారు చేసిన సేవలను స్మరించుకుంటూ ఈ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. రైతులు, కార్మికులు, యువత, విద్యార్థులు, ప్రజాతంత్రవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నల్లగొండ ఎంకన్న, భాషిపంగు సునీల్, ఉప్పుల మల్లయ్య, అనంతుల ఎల్లయ్య, కోడిబండ్లయ్య, వెంకన్న, అభిమాల వెంకన్న, నల్లగొండ లింగయ్య, గోగుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.






