కరెంట్ కట్ తో రైతుల నిరసన
నాట్లు వేసే సమయంలో కరెంటు కోతలు
సబ్ స్టేషన్ ఆపరేటర్ ను నిర్బంధించిన రైతులు
కామారెడ్డి జిల్లాలో రైతుల నిరసన
కామారెడ్డి,(విజయక్రాంతి): తరచుగా విద్యుత్ సరఫరా జరపకుండా నిలిపివేస్తున్నడంతో రైతులు నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఆరేపల్లి గ్రామంలో సోమవారం రైతులు సబ్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. వరి నాట్లు వేస్తున్న సమయంలో విద్యుత్ కోతలు విధించడం ఏమిటని రైతులు ప్రశ్నించారు. విద్యుత్ అధికారులకు తెలిపిన పట్టించుకోవడంలేదని రైతులు ఆరోపించారు. మూడు రోజులుగా తరచుగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని దీంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని రైతులు పేర్కొన్నారు.
విద్యుత్ అధికారులకు తెలిపిన పట్టించుకోవడంలేదని నిరసిస్తూ రైతులు సబ్ స్టేషన్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్ను గదిలో నిర్బంధించి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వచ్చి విద్యుత్ సరఫరాను కొనసాగిస్తేనే ఆపరేటర్ ను వదిలి పెడతామని రైతులు పేర్కొన్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే పంటలు ఎండుతున్నాయని, వరి నాట్లు వేసేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులు తెలిపారు.
విద్యుత్ సరఫరా నిరంతరం కొనసాగించాలని కోతలు పెట్టవద్దని రైతులు కోరారు. మూడు రోజులుగా విద్యుత్ సరఫరా తరచుగా తీసివేస్తూ కోతలు పెడుతున్నారని రైతులు ఆరోపించారు. వరి నాట్ల సమయంలో 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. విద్యుత్ అధికారులు కోతలు పెడితే ఆందోళనలను ఉదృతం చేస్తామని రైతులు తెలిపారు. ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. నిర్బంధించిన ఆపరేటర్ లో విడిచి పెట్టారు.






