7 July, 2026 | 12:49 AM

విద్య, వైద్యానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట

07-07-2026 12:00 AM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు

144 లబ్ధిదారులకు 45 లక్షల సీఎంఆర్‌ఎఫ్ నిధులు పంపిణీ

తుంగతుర్తి, జులై 6: తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల ప్రయోజనాల దుష్ట ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి విద్యా, వైద్యానికి పెద్దపీట వే శారని, నూతన అధ్యక్షులు మండలాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని గిరిజన సాంఘిక సంక్షేమ గురుకులంలో విద్యార్థులకు మెరుగైన విద్యా వస తి గృహానికి సుమారు 4 కోట్ల వ్యయంతో, తలపెట్టిన నూతన భవనానికి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు.

సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాలు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మో డల్ స్కూల్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు కేటాయించడం అభినందనీయమని అన్నారు. గతంలో గిరిజన గురుకు లాన్ని పర్యవేక్షణ చేసినప్పుడు, పరిస్థితులు గోరంగా ఉన్నాయని నేడు గురుకుల ప్రిన్సిపాల్ బోధన సిబ్బంది సహకారంతో గురు కుల విద్యార్థులు అత్యధిక మార్కులు సా ధ్యం చాలా సంతోషంగా ఉందని, గురుకుల విద్యార్థి రాష్ట్ర ర్యాంకును పొందినట్లయితే 50 వేల రూపాయలు బహుమతి అందిస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి గురుకులాల అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, మెస్ చార్జీలు పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని అన్నారు. 

నియోజకవర్గంలో గడిచిన రెండు సంవత్సరాల నుండి సుమారు 2000 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని 9 మండలాలకు, నూతన మండల పార్టీ అధ్యక్షులను, జిల్లా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ సహకారంతో కృషితో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.