కార్మికులకు మజ్జిగ పంపిణీ
06-05-2026 02:22 AM
కల్లూరు, మే 5 (విజయక్రాంతి): మున్సిపాలిటీ పరిధిలో వార్డు కౌన్సిలర్ ఉబ్బన రాంబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని కార్మికులకు,బాటసారులకు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభించింది.
మంగళవారం మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్ కేక్ కట్ చేసి రాంబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాసేవలో రాంబాబు మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరి, సత్యనారాయణ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు యాస నాగమణి, శ్రీకాంత్, గుండ్ల పుల్లారావు,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






