6 July, 2026 | 10:55 PM

అంజన్ రెడ్డికి ఘనంగా సన్మానం

06-07-2026 09:52 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైన త్రిపురం అంజన్ రెడ్డిని సోమవారం ఘనంగా సన్మానించారు. మండలంలోని తాళ్ల మల్కాపురం గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ కుర్రి మహేష్, గ్రామ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యామగాని నరసయ్య గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు త్రిపురం అంజన్ రెడ్డిని పూలమాలలతో శాలవాలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నిత్యం ప్రజాసేవే లక్ష్యంగా ప్రజల ఊపిరిగా నిస్వార్థ నాయకుడు నిత్యం ప్రజల మనిషిగా 50 సంవత్సరాల ప్రజా జీవితంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవకై నిత్యం తప్పిస్తున్న నాయకుడు అంజన్ రెడ్డికి అధిష్టానం రెండోసారి మండల పార్టీ అధ్యక్షునిగా రావడం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎంతో ఆనందంగా ఉందని వారన్నారు. పార్టీ అధిష్టానానికి, తనను సన్మానించిన నాయకులకు కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవలో ఎప్పుడు ముందుంటానని పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు యారగాని వెంకటేశ్వర్ల గౌడ్, రాతికింది అంజయ్య గౌడ్, చెరుకు శివకృష్ణ, వట్టికూటి వెంకటేశ్వర్లు పలువురు పాల్గొన్నారు