21 July, 2026 | 6:51 AM

ఇందిరమ్మ హౌసింగ్ టవర్స్ పథకానికి శ్రీకారం

20-07-2026 03:37 PM

హైదరాబాద్: సచివాలయం జీ-29లో హైదరాబాద్ క్యూర్ ఏరియాలో(Hyderabad Cure Area) ఇందిరమ్మ ఇళ్లు హౌసింగ్ టవర్స్ పథకాన్ని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అజారుద్దీన్ ప్రారంభించి బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రేవంత్ సర్కార్ హైదరాబాద్ నగరంలోని CURE (Core Urban Region Expansion) ప్రాంతంలో అత్యాధునిక సౌకర్యాలతో ఇందిరమ్మ ఇళ్లు హౌసింగ్ టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇది కేవలం గృహ నిర్మాణ పథకం మాత్రమే కాదు... వేలాది కుటుంబాలకు భద్రమైన, గౌరవప్రదమైన జీవనానికి పునాదని మంత్రులు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్‌లో సొంత ఇల్లు కొనుగోలు చేయాలనే కలను సామాన్య కుటుంబాలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.